Monday, January 17, 2022

రాజన్నసిరిసిల్ల విద్యార్థులు జాతీయ స్థాయి జిజ్ఞాస 2021 సైన్స్ ప్రదర్శనకు ఎంపిక*

*రాజన్నసిరిసిల్ల విద్యార్థులు జాతీయ స్థాయి జిజ్ఞాస 2021 సైన్స్ ప్రదర్శనకు ఎంపిక*      
                       అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జిజ్ఞాస 2021 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శన  పోటీలలో 33 జిల్లాల నుండి సుమారు 400 ఎంట్రీల నుండి 50 ఉత్తమ ప్రదర్శనలు రాష్ట్రస్థాయి ప్రదర్శనకు  ఎంపిక అయినాయి. ఇందులో  రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మొత్తం 6 సైన్స్ వర్కింగ్ మోడల్స్ ఈ నెల 28, 29 తేదీలలో ఆన్లైన్లో జూమ్ ప్లాట్ఫాం ద్వారా నిర్వహించిన  ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ పోటీలలో *మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెలుచుకున్న వారు మాత్రమే తదుపరి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. మొదటి బహుమతి 2000 నగదు హనుమకొండ జిల్లా వారు గెలుచుకోగా. రెండవ బహుమతి 1500 నగదు మన రాజన్న సిరిసిల్ల కు చెందిన *ఆస్పైర్ బైసికిల్,P. కావ్య,  గైడ్ టీచర్ D. స్వప్న ZPHS ధర్మారం*. గెలుపొందారు. అదేవిధంగా మూడో బహుమతి 1250 నగదు కూడా మన జిల్లాకు చెందిన  *టైం ఆదా చేసే మల్టీప్లెక్స్ నాగలిL.విజయకుమార్. గై టీచర్ వి. జ్యోతి TSMS మండేపల్లీ* గెలుపొందారు. కన్సోలేషన్ ప్రైజ్ గెలుపొందారు.    ఈ రాష్ట్రస్థాయి జిజ్ఞాస 2021 పోటీలు ఈరోజు 28 మరియు రేపు 29 వ తేదీలలో ఆన్లైన్లో నిర్వహించారు.ఈ ఎంపికైన 6 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి జూమ్ ప్లాట్ఫాం ద్వారా ఆన్లైన్ ప్రదర్శనలో పాల్గొన్నాయి. వీరు తదుపరి జనవరి 2022లో నిర్వహించబడే జాతీయ పోటీలకు ఐరిస్ IRIS (Initiative for Research Innovation in Stem) పంపించ బడతాయి.                        *జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల*