ఆన్లైన్ విధానంలో ఓజోన్ డే ఉపన్యాస పోటీలు
Covid 19 కారణంగా ఈరోజు ఓజోన్ డే సందర్భంగా,జాతీయ హరిత దళం తెలంగాణ(NGC) ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులకు మొట్ట మొదటిసారిగా ఆన్లైన్ విధానంలో ఉపన్యాస పోటీలను డి ఇ ఓ సి హెచ్.. ఎస్వి. జనార్ధనరావు సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇందులో జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 69 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఆన్ లైన్ , గూగుల్ మీట్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రతి విద్యార్థికి మూడు నిమిషాల ఉపన్యాసం నిర్వహించి, న్యాయనిర్ణేతలు గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా జడ్జిమెంట్ చేసి
అందులో నుండి ముగ్గురు విద్యార్థులను ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఎంపికచేయడం జరిగింది వీరికి త్వరలో సర్టిఫికెట్ తో పాటు మెమెంటో అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జాతీయ హరిత దళం NGC , రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్. విద్యాసాగర్, జాతీయ హరిత దళం జిల్లా కోఆర్డినేటర్ వి ఆంజనేయులు, సెక్టోరల్ ఆఫీసర్ వి.రామచంద్రరావు, దూస సంతోష్, V.మహేష్ చంద్ర ,S.కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు
మొదటి బహుమతి: తుమ్మా సిద్ధార్థ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడెం
రెండో బహుమతి:పట్నం సుమేధ TSMS బోయినపల్లి
మూడవ బహుమతి:గోగురి. అక్షయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుమాల ఎల్లారెడ్డిపేట.
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
ఆమ్లజని (ఆక్సీజన్) మరో రూపమే ఓజోన్. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్ అణువులు (O2) విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్ పరమాణువులుగా మారి ఓజోన్ అణువవుతుంది.
ఓజోన్ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.
ఓజోన్ తరిగిపోవడమంటే ఏమిటి?
క్లోరో ప్లూరో కార్బన్లు (CFCs) ఓజోన్ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్ కండీషన్ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్ను కల్గి ఉంటాయి.
రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్ని విడుదల చేస్తాయి.
మూడవ
దశః ఈ క్లోరీన్ పరమాణువులు
ఓజోన్ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్ తరిగి పోయేటట్లు చేస్తాయి
No comments:
Post a Comment