జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల.
ఇన్స్పైర్ నామినేషన్ల మరియు ఆన్లైన్ ఎగ్జిబిషన్ అప్లోడింగ్ పై అవగాహన కార్యక్రమం
👉2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనది.
👉మన విద్యార్థులు గత సంవత్సరం 111 ఇన్స్పైర్ అవార్డులను సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా అత్యధికంగా నామినేషన్లు పొందుట కొరకు ఆన్లైన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతోంది.
👉దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల, అన్ని యాజమాన్యాల (ప్రైవేటు మరియు ప్రభుత్వ, ఏయిడెడ్, మోడల్, కె.జి.బి.వి., రెసిడెన్షియల్) ప్రధానోపాధ్యాయులు, భౌతిక రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రాలు, గణితం మరియు ఇన్స్పైర్ పై ఆసక్తి గల ఉపాధ్యాయులు అందరికి అవగాహన కార్యక్రమం zoom platform మరియు YouTube link ద్వారా 👉 29.08.2022 మధ్యాహ్నం 2గo నుండి 4 గం వరకు నిర్వహించబడును.
ఈ అవగాహన కార్యక్రమంలో పాస్వర్డ్ చేంజ్, నామినేషన్ ల కొరకు వినూత్న ఆలోచనల ఎంపిక మరియు అప్లోడ్ గురించి తెలియజేయనున్నారు.
👉గూగుల్ ఫామ్ ద్వారా హాజరు వివరాలు నమోదు చేయబడును. Note మీటింగ్ యూట్యూబ్ లింక్.👇 https://youtube.com/c/vidyasiri జూమ్ లింక్ ఉదయం 10గo లకు అన్ని గ్రూప్ లలో పోస్ట్ చె్యబదుతుంది.
* ఇన్స్పైర్ అవగాహన సదస్సు*
ఈ రోజు ఈరోజు జూన్ ప్లాట్ ఫామ్ మరియు విద్యా సిరి ఛానల్ యూట్యూబ్ లింక్ ద్వారా ఆన్లైన్ మీటింగ్ ఇన్స్పైర్ manak అవార్డు2022-23 నామినేషన్ల కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాధా కిషన్ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఇన్స్పైర్ మనకు 2022- 23 నామినేషన్ల ప్రక్రియ ను వేగవంతం చేస్తూ దసరా సెలవుల కన్నా ముందే అనగా సెప్టెంబర్ 25 తేదీ లోపు పూర్తిచేయాలని ఆదేశించడం అయినది. గత రెండు సంవత్సరాలలో వివిధ సైన్స్ కాంపిటీషన్ లలో సాధించిన విజయాలను సమీక్షిస్తూ ఈ విద్యా సంవత్సరానికి గాను మరింత ఉత్సాహంగా అన్ని సైన్స్ కార్యక్రమాలలో పాల్గొని జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచే విధంగా పని చేయాలని సూచించారు. నూతనత్వం, సృజనాత్మకతతో ఉండి సామాజిక అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులచే వివిధ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రాజెక్టులను ఎన్నుకొని ప్రతి పాఠశాల నుండి 5 బెస్ట్ ఐడియాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించడం అయినది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యాధికారులు, ZP/Govt ప్రధానోపాధ్యాయులు, KGBV స్పెషల్ ఆఫీసర్, TSMS ప్రిన్సిపాల్స్ , ఫిజికల్ సైన్స్ ,బయో సైన్స్, గణిత ఫోరం అధ్యక్షులు, సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ అందరూ సమన్వయంతో పనిచేసి ఈ సంవత్సరం మన జిల్లా నుండి 1000 వినూత్న ఐడియాలను ఇన్స్పైర్ నామినేషన్ చేయాలని ఆదేశించారు.
ఇట్టి సమావేశ సమన్వయకర్త డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వి. వంతడుపుల ఆంజనేయులు, MEO లు D. రఘుపతి, శ్రీనివాస్ దీక్షితులు అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కస్తూరిబా పాఠశాలల స్పెషల్ ఆఫీసర్స్, తెలంగాణ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్స్,ఫిజికల్ సైన్స్,బయో సైన్స్ మరియు మ్యాథ్స్ ఫోరం అధ్యక్షులు, సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్, సైన్స్ ఉపాధ్యాయులు మొత్తం 360 కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి రాజన్న సిరిసిల్ల.
No comments:
Post a Comment