తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020
August,september,november(3 months)
255 Idea innovations submitted from 97 schools from our Rajannasiricilla
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యార్థి దశ నుండే సహజమైన ఆవిష్కరణలకు పునాది వేయాలని తీసుకున్న ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 97 ఉన్నత పాఠశాలల నుండి ఆక్టివ్ టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరికి ఈనెల 22వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు రెండున్నర గంటల ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు స్కూల్ ఆఫ్ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నమోదుచేసుకున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆన్లైన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోగలరు
ఉద్దేశ్యం: స్థానికంగా ఉండే సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించి పరికరాలు తయారు చేయించే ఒక గొప్ప సైన్స్ కార్యక్రమం.
ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు దీనికి అర్హులు అని అన్నారు ప్రతి పాఠశాల నుంచి ఇన్నోవేషన్ పై ఆసక్తి ఉన్న ఉపాధ్యాయున్ని స్కూల్ ఇన్నోవేషన్- 2020 అనే వెబ్సైట్లో ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది.
మొదటి దశ
ఇన్నోవేటివ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది
రెండవ దశ
ఇన్నోవేటివ్ విద్యార్థిని, విద్యార్థులకు సూచనలు, సలహాలు కొరకుT-SAT/ యూట్యూబ్ ద్వారా అవగాహన కార్యక్రమం ఉంటుంది.
మూడో దశ
ఇన్నోవేటివ్ విద్యార్థులను గుర్తించి రెండు గ్రూపులుగా తయారుచేయడం ఉంటుంది (ప్రతి గ్రూపులో కనీసం ఇద్దరు గరిష్ట నలుగురు)
నాలుగో దశ
ఫోన్ ద్వారా గాని ఆన్లైన్ మీటింగ్ ద్వారా గాని ఈ ఇన్నోవేటివ్ స్టూడెంట్స్ కి శిక్షణా కార్యక్రమం ఉంటుంది.
ఐదో దశ
ఆన్లైన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఆన్లైన్ వీడియో ఎగ్జిబిషన్ ఉంటుంది
ఆరో దశ
ఈ ఎగ్జిబిషన్ లో నుండి టాప్ 25 ఇన్నోవేషన్స్ ని ఎంపిక చేసి వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది.
No comments:
Post a Comment