Wednesday, November 18, 2020

రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా వారోత్సవాలు-2020

 రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా వారోత్సవాలు

                       విద్యార్థుల ప్రయోగాలు అన్వేషణ లకు అవకాశం పాల్గొననున్న ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే భావి భారత శాస్త్రవేత్తలు రూపుదిద్దుకోవాలి అన్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఆవిష్కార్ వారోత్సవాలు అక్టోబర్ 15-2020 నుంచి 20 వరకు నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమం నవంబర్ 2 నుంచి నిర్వహించేందుకు సన్నద్ధమైంది మానవ వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్  ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రయోగాలు, అన్వేషణల సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో తో ఆదేశించారు  విద్యార్థుల్లో అర్థవంతమైన ఆహ్లాదకరమైన అవకాశం ఇవ్వడం ద్వారా విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నతిని సాధించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆవిష్కార్ ఏర్పాటు చేసింది.గత రెండు సంవత్సరాలుగా నీటి అవసరం ఉపయోగం అనే అంశాలపై విద్యార్థులు ప్రయోగాలు నూతన ఆవిష్కరణలు చేయాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గృహ వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం దాని ఆవశ్యకతను తెలుసుకొని ప్రయోగాల ద్వారా నీటి వృథాను తగ్గించే ఆవిష్కరణలు విద్యార్థుల నుంచి వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు
పాఠశాలల ఎంపిక
ప్రతి మండలానికి మూడు పాఠశాలలు చొప్పున ఎంపిక చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రాథమికోన్నత ఉన్నత సెకండరీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ రంగం గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు నీటి వినియోగం ,కార్బన్ ప్రింట్ లెక్కింపు,
1.గృహ ప్రయోజనాలకు వాడే నీటి గణన
2.తోట పనికి వాడే నీటి గణన
 4.వ్యవసాయ పంటలకు వాడే నీటి గణన
 3.నెలలో కార్బన్ పాదముద్ర గణన 

పై ప్రయోగ సామర్థ్యం విద్యార్థుల చేత ప్రయోగాలు నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తారు దీని ఫలితంగా భవిష్యత్తులో నీటి వినియోగంపై విద్యార్థులకు పాఠశాలల్లోనే అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎంపిక చేసిన  పాఠశాలలు ఈ ప్రయోగశాల ఫలితాలను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
ప్రయోగాల్లో ఉపాధ్యాయుల పాత్ర
ఉపాధ్యాయుడు అవసరమైన సూచనలను ఆన్లైన్ డిజిటల్ రూపంలో విద్యార్థులకు  అందించాల్సి ఉంటుంది అధ్యయన లక్ష్యాలు విద్యార్థులకు వివరించాలి ప్రయోగాలు చేసే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైన పరికరాలు ప్రయోగ విధానం విద్యార్థుల శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే విధానం విద్యార్థులకు బోధించాలి
వీలైన చోట covid 19 నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయుల సమక్షంలో కూడా ప్రయోగాలు చేయవచ్చు.
విద్యార్థులు తమ అనుభవాలను ఆన్లైన్ డిజిటల్ మోడల్ మిగతా విద్యార్థులతో పంచుకోవాలి ప్రయోగాల ప్రదర్శన ద్వారా వారి అనుభవాలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాలి విద్యార్థులు ఈ ప్రయోగాలను తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించాలి ప్రయోగ ఫలితాలను ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులకు తెలియజేయాలి ఆ తర్వాత ఉపాధ్యాయులు NCERT,SCERT రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపించాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్. ధనలకోట రాధా కిషన్ గారు,ఎస్. మొండయ్య డైట్ ఫ్యాకల్టీ, వి.రామచంద్రరావు సెక్టోరల్ ఆఫీసర్,వి.ఆంజనేయులు జిల్లా లా సైన్స్ ఆఫీసర్, బి.నవీన్ భౌతిక శాస్త్రం, రిసోర్స్ పర్సన్ వి. తిరుపతి రెడ్డి జీవశాస్త్ర రిసోర్స్ పర్సన్
పాల్గొన్నారు 

 
















No comments:

Post a Comment