Friday, April 29, 2022

Artificial Intelligence

 Artificial Intelligence
కృత్రిమ మేధ పట్ల యువ ఇన్నోవేటర్స్ ను సన్నద్ధం చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీ, భారత ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని రూపొందించారు,ఈ కార్యక్రమంలో  ప్రస్తుతం  2020-21, 2021-22  ఇన్స్పైర్ కి ఎంపికైన బాల, బాలికలు (6నుండి10వతరగతి చదివేవారు) క్రింది link ద్వారా రిజిస్టర్ చేసుకుని తప్పకుండా పాల్గొనవలసి ఉంటుంది.
https://inspiremanak.buildingaireadiness.in/home
ఏవేని సందేహాలు ఉంటే క్రిందిసమాచారాన్ని వినియోగించుకోవచ్చును.
Contact:
For any queries related to the program, you may reach out to us at
  support@buildingaireadiness.in
  9964600800
(9 am to 8 pm; Monday to Friday)
గమనిక: రిజిస్ట్రేషన్ లు ప్రారంభం అయినవి, ఈ మెసేజ్ తో పాటు 2020-21 &  2021-22  list యొక్క పిడిఎఫ్ జతచేయ బడినది.అందులోని విద్యార్థినీ విద్యార్థులు అందరూ వెంటనే పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్స్ బాధ్యత వహించాలి.
DEO, Rajannasiricilla

Artificial intelligence elligible students previous two years 2020-21,2021-22 inspire lists









49వ జవహర్ లాల్ నెహ్రూ జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శన 24-03-2022

 










 జోహార్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-2022 విజయవంతం  శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కొరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న
 జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్  ఎన్విరాన్‌మెంట్ (JNNSMEE-2022)  జిల్లా స్థాయి ఎక్సిబిషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో
1. అన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ,స్థానిక, ఆశ్రమ,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.        
1. *పర్యావరణ స్నేహపూర్వక పదార్థం(Eco Friendly Material).             జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ వేములవాడ నుండి K. ఆ నీల తయారు చేసినటువంటి పర్యావరణ ఇటుక (ఎకో బ్రిక్)
2. *ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత(Health and Cleanliness).            జెడ్ పి హెచ్ ఎస్ దమ్మన్న పేట నుండి S. అశ్విత తయారు చేసిన ఆంటీ పాండమిక్ డిసేబుల్ ఫ్రెండ్ వాష్ బేసిన్
3. * సాఫ్ట్‌వేర్ అండ్ ఆప్స్(Software and Apps).                                 టి ఎస్ ఎం ఎస్ నామాపూర్  నుండి R. అఖిల బ్లూ టూత్ హోమ్ ఆటోమేషన్ ఫర్ ఎలక్ట్రికల్ డివైసెస్
4. *రవాణా  (Transport).                       జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి CH. వైష్ణవి చేసినటువంటి మెట్లపై బరువులను సులభంగా తీసుకుపోయే ట్రాలీ
5.*పర్యావరణం- సుస్థిర మార్పులు లు(Environmental & Claimate  Changes).         జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ శివనగర్ నుండి J. హేమంత్ తయారుచేసిన ఫుడ్ గ్రైన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ రైన్ (ధాన్యము తడవకుండా రక్షించే పరికరం)
6. *గణిత మోడలింగ్,(Mathematical Modelling)                         జడ్పిహెచ్ఎస్ ముచ్చర్ల నుండి K.శ్రుతకీర్తి తయారుచేసిన angle subtended by arc ఇలా ఆరు అంశాలవారీగా 120 ఎక్స్బిట్స్  ఆన్లైన్ ద్వారా తేదీ 3-03-2022 నుండి 20-32022 వరకు  ప్రాజెక్టుకు సంబంధించిన writeup,  ఫోటో, వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.24-03-2022 రోజున జడ్జిమెంట్ చేసి ఫలితాలు జిల్లా విద్యాధికారి Dr.D. రాధా కిషన్  ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి అంశం ఒకరు మాత్రమే సెలెక్ట్ కాబడి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ఆరు అంశాలకు ఆరుగురు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని అని తెలియజేశారు.  ఎంపిక కాబడిన వీరు మరింత ప్రాజెక్టు ను మెరుగుపరుచుకుని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయిలో ఎంపిక కాబడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరనైనది. అదేవిధంగా గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాధికారి, సెక్టోరల్ కోఆర్డినేటర్ వి శైలజ, జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు అభినందనలు తెలియజేశారు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల.

49వ జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ విజేతలు వీరే : జిల్లా విద్యాశాఖాధికారి

 49వ జవహర్ లాల్ నెహ్రూ జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ  ప్రదర్శన లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ సెమినార్ విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి Dr.D. రాధా కిషన్, శుక్రవారం వెల్లడించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పోటీలలో 23 విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో సత్తా చాటి మొదటి బహుమతి పొందిన విద్యార్ధి 13-04-2022 రోజున జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని డి.ఇ.ఓ పేర్కొన్నారు.                       *సైంటిఫిక్ అకాడమిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ప్రధాన అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక సైన్స్ సెమినార్ మొదటి బహుమతి K. స్రవంతి (జూనియర్ ఇంటర్,TSEMRS Yellareddypet),రెండవ బహుమతి J.ఆశ్విత (9వ తరగతి, TSMS Naamapoor) గెలుపొందారు వీరికి  సెక్టరాల్ కోఆర్డినేటర్ వి. శైలజ, మండల విద్యాధికారి డి.రఘుపతి ,జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు ,  అభినందనలు తెలియజేశారు.

✍️జిల్లా విద్యాశాఖాధికారి రాజన్నసిరిసిల్ల

స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (SIC) 23rd march 2022

 


 







స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (SIC) 2021 బూట్ క్యాంపుకు ఆహ్వానం  స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రాం లో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 3 ఐడియా ఎంపిక కాబడ్డాయి. అవి 1. ZPHS Vallampatla, Bose  group,2. ZPHS Ellanthakunta,Vikram Sarabhai group,3.KGBV Veernapally, Bhavya group ఈ పాఠశాలలోని గ్రూప్ విద్యార్థిని, విద్యార్థులు Guide టీచర్ తప్పనిసరిగా రేపు తేదీ.23-3-2022 ఉదయం 9 గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సైన్స్ మ్యూజియం లో జరగబోయే వర్క్ షాప్ కి హాజరు కావాలి.జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల




 

జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-2022 నిర్వహణ పై, సైన్స్ & గణిత ఉపాధ్యాయులకు ఆన్లైన్ అవగాహన సమావేశం

 



 జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-2022 నిర్వహణ పై, సైన్స్ & గణిత ఉపాధ్యాయులకు ఆన్లైన్ అవగాహన సమావేశం శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కొరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న
 జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్  ఎన్విరాన్‌మెంట్ (JNNSMEE-2022)  జిల్లా స్థాయి ఎక్సిబిషన్ నిర్వహించుటకు జిల్లాలోని సైన్సు మరియు గణిత ఉపాధ్యాయులకు తేదీ.05-03-2022 , మధ్యాహ్నం 2గంటలకు జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన పరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా విద్యాధికారి డాక్టర్ D. రాధాకిష న్ గారు మాట్లాడుతూ
1. అన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ,స్థానిక, ఆశ్రమ,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులను పాల్గొనేటట్లు చేయాలి. విద్యార్థులలో పాఠశాల స్థాయి నుంచి శాస్త్రీయ దృక్పధం అలవర్చుకోవడం కోసం ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉపకరిస్తాయని సైన్స్ ,గణితం సోషల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులను ప్రశ్నించే విధంగా, స్థానిక సమస్యల పరిష్కారం కనుగొనే విధంగా సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేసేటట్టు ప్రోత్సహించి, వినూత్న ఆవిష్కరణలు చేపట్టి ప్రతి పాఠశాల నుండి          

*ఉప అంశములు:
1. *పర్యావరణ స్నేహపూర్వక పదార్థం(Eco Friendly Material)
2. *ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత(Health and Cleanliness)
3. * సాఫ్ట్‌వేర్ అండ్ ఆప్స్(Software and Apps)
4. *రవాణా  (Transport)
5.*పర్యావరణం- సుస్థిర మార్పులు లు(Environmental & Claimate  Changes)
6. *గణిత మోడలింగ్,(Mathematical Modelling) వారిగా 6 ఎక్స్బిట్స్  ఆన్లైన్ ద్వారా తేదీ 14-03-2022 లోపు ప్రాజెక్టుకు సంబంధించిన writeup,  ఫోటో, వీడియో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రదర్శన విజయవంతం కావడానికి                                   జిల్లాలోని మండల విద్యాధికారులు అన్ని యాజమాన్యాల (Govt/ZP/TSMS/KGBV/Private)  ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్, సైన్సు, గణిత, సోషల్ ఉపాధ్యాయులు కృషి  చేయాలని ఆదేశించనైనది. సెక్టోరల్ కోఆర్డినేటర్ వి శైలజ, జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు, వి. తిరుపతి రెడ్డి ,T.సంపత్ కుమార్ డి.శ్రీనివాస్ రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల.

49th District level Jawaharlal Nehru National Science mathematics and environmental exhibition (JNNSMEE-2022)
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 REGISTRATION AND PROJECT UPLOAD Before: 14-03-2022
📣📣📣📣📣📣📣📣📣
 EXHIBITS EVOLUTION: 15-03-2022
📝📝📝📝📝📝📝📝📝
 1. Eco friendly material (పర్యావరణ స్నేహపూర్వక పదార్థం)
https://forms.gle/JAu8DJCATCciP9MZ7
2. Health and cleanliness (ఆరోగ్యం పరిశుభ్రత & శుభ్రత )
https://forms.gle/Vxq4EsGFPspk2UW76
3. Software and apps (సాఫ్ట్వేర్ అండ్ ఆప్స్)
https://forms.gle/Kg8Q54Qf7EwqSkfDA
 4. Transport (రవాణా)
https://forms.gle/9nqL3ZqU3rzqZq9t6
 5.Environmental & climate changes(పర్యావరణం - సుస్థిర మార్పులు)
https://forms.gle/uSindWRgjY2VAeyx6
 6.Mathematical Modelling
https://forms.gle/2YNogXMj6KzNXxMz5
 JNNSMEE-2022 link for registration and upload the projects👆

 

Science fair clips 28-02-2022

 








రాష్ట్రీయ ఆవిష్కార్ సప్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ తేదీ. 23-02-2022

 







రాష్ట్రీయ ఆవిష్కార్ సప్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ  తేదీ.24-2-2022 రోజున మధ్యాహ్నం రెండు గంటలకు  జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది.             ఆవిష్కరణ వారోత్సవం
నేటి నుంచి రాష్ట్రీయ ఆవిష్కార్ వారోత్సవాలు
విద్యార్థుల ప్రయోగాలు అన్వేషణ లకు అవకాశం
పాల్గొననున్న ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులు
పాఠశాల స్థాయి నుండే భావి భారత శాస్త్రవేత్తలు రూపుదిద్దుకోవాలి అన్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఆవిష్కార్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15-2020 నుంచి 20 వరకు నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ సంవత్సరం విద్యాలయాలు లేటుగా ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమం 23-2-2022 నుంచి 28-2-2022 నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్  ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రయోగాలు, అన్వేషణల సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో తో ఆదేశించారు  విద్యార్థుల్లో అర్థవంతమైన ఆహ్లాదకరమైన అవకాశం ఇవ్వడం ద్వారా విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నతిని సాధించడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆవిష్కార్ ఏర్పాటు చేసింది.గత రెండు సంవత్సరాలుగా నీటి అవసరం ఉపయోగం అనే అంశాలపై విద్యార్థులు ప్రయోగాలు నూతన ఆవిష్కరణలు చేయాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
  గృహ వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం దాని ఆవశ్యకతను తెలుసుకొని ప్రయోగాల ద్వారా నీటి వృథాను తగ్గించే ఆవిష్కరణలు విద్యార్థుల నుంచి వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు
పాఠశాలల ఎంపిక
ప్రతి మండలానికి మూడు పాఠశాలలు చొప్పున ఎంపిక చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రాథమికోన్నత ఉన్నత సెకండరీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ రంగం గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు నీటి వినియోగం ,కార్బన్ ప్రింట్ లెక్కింపు,
గృహ ప్రయోజనాలకు వాడే నీటి గణన
తోట పనికి వాడే నీటి గణన
 వ్యవసాయ పంటలకు వాడే నీటి గణన
 నెలలో కార్బన్ పాదముద్ర గణన  పై ప్రయోగ సామర్థ్యం విద్యార్థుల చేత ప్రయోగాలు నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తారు దీని ఫలితంగా భవిష్యత్తులో నీటి వినియోగంపై విద్యార్థులకు పాఠశాలల్లోనే అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎంపిక చేసిన  పాఠశాలలు ఈ ప్రయోగశాల ఫలితాలను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
ప్రయోగాల్లో ఉపాధ్యాయుల పాత్ర
ఉపాధ్యాయుడు అవసరమైన సూచనలను ఆన్లైన్ డిజిటల్ రూపంలో విద్యార్థులకు  అందించాల్సి ఉంటుంది అధ్యయన లక్ష్యాలు విద్యార్థులకు వివరించాలి ప్రయోగాలు చేసే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైన పరికరాలు ప్రయోగ విధానం విద్యార్థుల శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే విధానం విద్యార్థులకు బోధించాలి.
 విద్యార్థుల పాత్ర   విద్యార్థులు తమ అనుభవాలను ఆన్లైన్ డిజిటల్ మోడల్ మిగతా విద్యార్థులతో పంచుకోవాలి ప్రయోగాల ప్రదర్శన ద్వారా వారి అనుభవాలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాలి విద్యార్థులు ఈ ప్రయోగాలను తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించాలి ప్రయోగ ఫలితాలను ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులకు తెలియజేయాలి ఆ తర్వాత ఉపాధ్యాయులు NCERT,SCERT రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపించాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో వి.శైలజ సెక్టోరల్ కోఆర్డినేటర్-2
వి.ఆంజనేయులు జిల్లా  సైన్స్ ఆఫీసర్, బి.నవీన్ భౌతిక శాస్త్రం, రిసోర్స్ పర్సన్ D. సంతోష్ జీవశాస్త్ర రిసోర్స్ పర్సన్
పాల్గొన్నారు అని జిల్లా విద్యాధికారి డాక్టర్. ధనలకోట రాధా కిషన్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ 28-02-2022







రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ Zp/Govt,TSMS,KGBV, రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు సైన్స్ ఉపాధ్యాయులకు నమస్కారాలు. 🍀🍀🍀🍀
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించే ఆన్లైన్ క్విజ్  కాంపిటీషన్ లో 6 నుండి 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించ గలరు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
 సమయం: ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:45 నిమిషాల వరకు.
🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️
https://forms.gle/V75KhgoNXd1gFgeBA
8,9&10th Class Link👆
https://forms.gle/5Mw6cdxVH3iYqrZM9
6&7th Class Link👆
 Note: ఆన్లైన్ టెస్ట్ సాయంత్రం 7 గంటలకు మాత్రమే ఓపెన్ అవుతుంది గమనించగలరు. విద్యార్థులు ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు సరైన వివరాలు ఇవ్వాలి.
 పై లింకులను మీ స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయగలరు. కేవలం ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు సీనియర్,జూనియర్ విభాగాల్లో పాల్గొనాలి.