Saturday, December 4, 2021
అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ కలెక్టర్ సమీక్ష
*అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ కలెక్టర్ సమీక్ష* ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల విద్యా శాఖకు సంబంధించిన 14 వివిధ పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ గురించిన సమీక్ష సమావేశం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి గారు ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుని అడిగి కూలంకుషంగా ATL ల్యాబ్ నిర్వహణ గురించి తెలుసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అటల్ టింకరింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ- మార్కెట్ ఏజెన్సీ ద్వారా మెటీరియల్ ప్రోక్యుర్ చేయడం జరిగింది అని ప్రధానోపాధ్యాయులు వివరించారు. మంజూరైన 14 అటల్ టింకరింగ్ ల్యాబ్ లో 3 పాఠశాలలకు నిధులు జమ కాలేదు. 11 పాఠశాలల్లో దాదాపుగా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. 4 పాఠశాలల్లో వర్క్స్ షాప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. తదుపరి అటల్ టింకరింగ్ ల్యాబ్ కు సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పాటించి ల్యాబ్ నిర్వహణ విజయవంతంగా నడిపించి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ గారు సూచించారు.ఈ సమావేశంలో DEO. డాక్టర్.D. రాధా కిషన్ ,DSO.V. ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment