Saturday, December 4, 2021
జాతీయ పిల్లల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా గురుశాల మరియు ప్రథమ్ సంస్థ సహకారంతో "వొడాఫోన్ ఐడియా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ 20 21
*రాజన్న సిరిసిల్ల విద్యార్థిని యంగ్ అచీవర్స్ గా ఎంపిక*. జాతీయ పిల్లల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా గురుశాల మరియు ప్రథమ్ సంస్థ సహకారంతో "వొడాఫోన్ ఐడియా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ 20 21" నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా *మీట్ ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్* విభాగంలో *నేషనల్ అచీవర్స్ ఆన్లైన్ ఇంటర్వ్యకు* దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థినీ, విద్యార్థుల నుండి 65 ఇన్నోవేటివ్ ఐడియాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో నుండి ఐదుగురు విద్యార్థులు వేరు వేరు రాష్ట్రాల ద్వారా ఎంపిక కావడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థిని. U. కీర్తి 5th class, కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ వేములవాడ నుండి తయారు చేసిన *మినీ అగ్రికల్చర్ బ్యాగ్* ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి డాక్టర్.D. రాధా కిషన్, సెక్టోరల్ కోఆర్డినేటర్ వి. శైలజ, జిల్లా సైన్స్ అధికారి. వి. ఆంజనేయులు అభినందించారు. *వీరిని ఆన్లైన్ లో జూమ్ విత్ యూట్యూబ్ ప్లాట్ఫాం ద్వారా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన H.C వర్మ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ గారు వీరితో ఆన్లైన్ లో ఇంట్రాక్ట్ అవుతారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 3.00 నుండి 4.30 నిమిషాల వరకు ఆన్లైన్లో జరుగుతుంది దీనిని తప్పక జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ ,విద్యార్థులు వీక్షించగలరు. LInk: https://www.youtube.com/watch?v=AGx81ah0GZI *జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment