గణిత ఆన్లైన్ సెమినార్ లో పాల్గొనీ విజయవంతం చేద్దాం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి 22 డిసెంబర్ సందర్భంగా రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి తెలంగాణ TS SCERT నిర్వహించబోయే గణిత ఈ-సెమినార్ కు కొన్ని సూచనలు.
ప్రధాన అంశం. నూతన విద్యా విధానం-2020 సందర్భాన ముందు మార్గాన గణిత విద్యా ప్రధాన అంశం.
ఉప అంశాలు: 1.అంతర్జాతీయ గణిత విద్యకు ధీటుగా పాఠశాల విద్య పాఠ్యప్రణాళిక లో చేర్చాల్సిన సంస్కరణలు. 2.గణిత విద్యను మరింత ఆసక్తికరంగా, సమర్థవంతంగా ,శాస్త్ర సాంకేతిక రంగాల అనుసంధానంతో , అనువర్తన విలువలలు 3.గణిత బోధన చేసేందుకు బోధనా పద్ధతులు సంస్కరణలు.
4ఆన్లైన్ విధానంలో గణిత బోధనలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అధిగమించే పద్ధతులు
5.వేదగణితం, ప్రస్తుత గణిత బోధనలో దాని ప్రాధాన్యత
అర్హులు;గణిత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకులు, పరిశోధకులు, పాఠశాల విద్యకు సంబంధించిన ఇతర రంగాల వారు ఇందులో పాల్గొనవచ్చు.
రైటర్ తయారుచేయు విధానం
ఎంపిక చేసుకున్న ఈ -సెమినార్ పత్రాలను తెలుగులో అయితే అను స్క్రిప్ట్, ఫాంట్ సైజ్ 18, ఇంగ్లీష్ లో అయితే Ms word pont size12 Times newroman 4 పేజీలు మించకుండా PDF ఫార్మేట్ లో తయారు చేసుకోవాలి.
1. ప్రధాన అంశము (Theme)
2. ఉప అంశము(Sub Theme)
3. సెమినార్ లక్ష్యాలు
4. వ్యక్తిగత వివరములు
పేరు, హోదా, విద్యార్హతలు
అడ్రస్ ,ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడి
5. అంశం పేరు (title of the topic)
లక్ష్యాలు (objectives)
ప్రజెంటేషన్(presentation)
ఫలితాలు(outcomes)
చిక్కులు (Implications)
సూచనలు (References)
ఇలా తయారుచేసుకున్న సెమినార్ పత్రాన్ని డిసెంబర్ 2వ తారీఖు లోపు e-మెయిల్ కానీ పోస్టు ద్వారా కానీ ఈ క్రింది అడ్రస్ కు పంపించాలి
డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్,
ఎల్బీ స్టేడియం ఎదురుగా,
"E"గేట్, అలియా స్కూల్ కాంపౌండ్,TS SCERT,
హైదరాబాద్-500001
Email: tgscertmathsscience@gmail.com
అందిన అన్ని ప్రాజెక్టులను స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎంపికైన వారికి ప్రత్యేక ఆహ్వానం అందుతుంది. అప్పుడు వారు, వారి సెమినార్ పత్రాలను (e-flot form) ఆన్లైన్ ద్వారా ప్రజెంటేషన్ చేయాలి.