Tuesday, November 17, 2020

ఆన్లైన్ విధానంలో ఇన్స్పైర్ ప్రదర్శన సన్నాహక ఏర్పాట్లు

 

ఆన్లైన్ విధానంలో ఇన్స్పైర్ ప్రదర్శన సన్నాహక ఏర్పాట్లు

Date 14/5/2020 

కోవిడ్-19 నేపథ్యంలో విజ్ఞాన ప్రదర్శన ల విధానంలో పలు మార్పులు రానున్నాయి. 2019-20 సంవత్సరానికి గాను ఇన్స్పైర్ ప్రదర్శనను జూన్ చివరిలో వారంలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు శాస్త్ర సాంకేతిక మండలి (DST)న్యూఢిల్లీ, తెలంగాణ విద్యాశాఖ తెలియజేయడం జరిగింది.

 ఈ ఎంపిక కాబడ్డ విద్యార్థులకు eDLEPC, eSLEPC అనగా ఆన్లైన్ ద్వారా ఈ జూన్ నెలలో మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి.  శాస్త్ర సాంకేతిక మండలి న్యూఢిల్లీ వారు ఇటీవల ప్రకటించిందని జిల్లా విద్యాశాఖ అధికారి  డాక్టర్. డి. రాధకిషన్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 35 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వీరు వచ్చే నెలలో ఆన్లైన్ విధానంలో తమ మోడల్ ప్రదర్శించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు, త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలను సదరు  విద్యార్థులకు తెలియపరుస్తూమని వివరించారు. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాజెక్టును గైడ్  టీచర్స్, విద్యార్థులకు సూచనలను ఇస్తూ మంచి వర్కింగ్ మోడల్ ను తయారుచేయించి విద్యార్థిని బాగా ప్రాక్టీస్ చేయించాలి. 3 సెట్స్  రైటుప్స్ ను తయారు చేసి ఒక write up, DSO V. ఆంజనేయులు కు అందజేయాలి అని అన్నారు. అదేవిధంగా ఈ 35 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు తెలియపరుస్తుంది, ఏమనగా ఈ విద్యార్థులకు ప్రాజెక్ట్ కొరకు 10,000rs వారి అకౌంట్ లో జమకావడం జరిగింది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకొని మీ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులచే మీ ఎంపిక కాబడ్డ ప్రాజెక్టును తయారుచేయటకు సహకారం అందించి ఆన్లైన్ ప్రదర్శనకు విద్యార్థులను సంసిద్ధులను చేయగలరు.ప్రాజెక్ట్ ఎంపికై డబ్బులు జమ కానీ వారి సంబంధిత మెయిల్ లో జమకాకపోవడానికి కారణం తెలుసుకొని, ఇన్స్పైర్ వెబ్ సైట్ లో మెయిల్ ద్వారా  కంప్లైంట్ పెట్టగలరు. ఇంకేమైనా సందేహాలు ఉంటే DSO ఫోన్ నెంబర్ 9948539212 కు సంప్రదించగలరు.

           





                      

 

No comments:

Post a Comment