జిల్లా విద్యాశాఖ, రాజన్న సిరిసిల్ల**
జిల్లాలోని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయునది,
👉 క్రిందటి సంవత్సరం 2019-20 Inspire అవార్డ్స్ లో భాగంగా మన జిల్లా నుండి 35 మంది విద్యార్థులు రూ. 10,000/- చొప్పున పొంది ఎంపికైనారు.
ఈ విద్యా సంవత్సరం 2020-21 విద్యార్థుల ఎంపిక ఇంకా జరుపబడలేదు
👉 DST, GOI మరియు SCERT తెలంగాణ వారి ఆదేశానుసారం ఎంపికైన ఈ 35 విద్యార్థులకు డిసెంబర్ 07వ తేదీ నుండి 11 వ తేదీ లోపు ఆన్లైన్ లో MANAK Competition App ద్వారా జిల్లా స్థాయి విజ్ఞాన మేళా నిర్వహించుటకు సన్నాహాలు చేయమని ఆదేశించింది.
👉👉కనుక ఎంపికయిన విద్యార్థుల ప్రధానోపాధ్యాయులు వారి గైడ్ టీచర్ సహాయంతో విద్యార్థుల ద్వారా వారి వారి ప్రాజెక్ట్ల రూపకల్పన చేస్తూ డిసెంబర్ 5వ తేదీ లోపు సంసిద్ధులు చేయగలరు.
👉 MANAK Competition App ఆన్లైన్ లో జిల్లా స్థాయి Inspire విజ్ఞాన్ మేళా పూర్తి విధి విధానాలను త్వరలో ప్రధానోపాధ్యాయులకు, గైడ్ టీచర్స్ కు అవగాహన కల్పించడం జరుగుతుంది.
👉 కనుక ఎంపికైన ప్రతి ప్రాజెక్టు తయారీలో నిమగ్నం చేయగలరని కోరుచున్నాం.
DEO RAJANNA SIRCILLA
ఆన్లైన్ ఇన్స్పైర్ మనాక్ 2019-20 ప్రదర్శన విజేతలు వీరే:
ఇన్స్పైర్ మనకు కార్యక్రమాన్ని ఈసారి covid-19 కారణంగా మొట్టమొదటిసారిగా జిల్లాస్థాయి ప్రదర్శన పోటీలు ఆన్లైన్ లో నిర్వహించాము. మన జిల్లా నుండి , ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, పాఠశాలల నుండి 35 మంది విద్యార్థిని, విద్యార్థులు ఇంటి వద్ద ఉండి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపి ప్రదర్శనలను తయారు చేసి రెండు నిమిషాల నిడివి గల వీడియో, ఆడియో, సంబంధించిన ఫోటోలు మరియు రైట్ అప్ లు ఇన్స్పైర్ అవార్డ్స్ యాప్ లో ఈనెల 4వ తేదీ నుండి 18వ తేదీ శుక్రవారం వరకు అప్లోడ్ చేసినారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను న్యాయనిర్ణేతలు ఆన్లైన్లో పరిశీలించి మన జిల్లా నుండి ఐదు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేయడం జరిగింది, వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు పోటీలలో పాల్గొనటారు అని జిల్లా విద్యాశాఖ అధికారి Dr.D. రాధకిషన్ గారు తెలిపారు.
జిల్లా నుండి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన వారి వివరాలు
1.అప్లై ఫెర్టిలైజర్స్ ఇన్ ఈజీ వే (సులభ పద్ధతిలో ఎరువులను వేసే పరికరం)
మారుపాక చంద్రశేఖర్ జడ్.పి.హెచ్.ఎస్ సనుగుల,
2. వీల్ సీడ్స్ స్ప్రే మెషిన్(విత్తనాలు చల్లడం ఎరువులు స్ప్రే చేయడం, కలుపు మొక్కలు తీసే మల్టిపుల్ యంత్రం)
B. సరయు కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్, వేములవాడ
3. ఆటోమేటిక్ టాయిలెట్ వాటర్ ప్లస్ (చేతితో తాకకుండా వాటర్ ప్లస్ చేసే పరికరం)
చిలువేరు శ్రీ వర్ధన్ జడ్.పి.హెచ్.ఎస్ లింగంపేట్.
4. ఆటోమేటిక్ కాబ్వెబ్ అండ్ డస్ట్ రిమూవర్ ఫ్రమ్ సీలింగ్(తక్కువ ఖర్చుతో బిల్డింగ్ యొక్క సీలింగ్ ని శుభ్రం చేసే పరికరం)
ఏగోళం నవదీప్
జడ్.పి.హెచ్.ఎస్ సనుగుల
5. ఫ్రెండ్లీ అండ్ అఫార్డబ్లే టాయిలెట్ (మొబైల్ టాయిలెట్)
తునికి ఆకాష్
జడ్.పి.హెచ్.ఎస్ ఇల్లంతకుంట.
ఎంపికైన టువంటి విద్యార్థినీ విద్యార్థులను జిల్లా విద్యా శాఖ పక్షాన DEO,Dr.D. రాధా కిషన్ గారు మరియు జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు , సెక్టోరల్ ఆఫీసర్స్ వి.రామచంద్రరావు, N.రాజేంద్ర శర్మ, అశోక్ రావు అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment