48 వ జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జిల్లా స్థాయి ఎక్జిభిషన్ (JNNSMEE):
★రిజిస్ట్రేషన్ మరియు exhibit/ప్రాజెక్ట్ అప్లోడ్ కు చివరి తేదీ 28.02.2021★ ★Exhibhition Evaluation 01.03.2021 &02.03.2021*
★Exhibits/ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయుటకు లింక్👇https://forms.gle/7Zy1KHghFjMYvFMc6
💐 ఇతివృత్తాలు మరియు ఉప అంశాలు💐 ★అంశం★ "టెక్నాలజీ అండ్ టాయ్స్" ఉప థీమ్స్:
1.పర్యావరణ స్నేహపూర్వక పదార్థం
2. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత
3. ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్
4. చారిత్రక అభివృద్ధి
5. గణిత మోడలింగ్,
🖋️ఉపాధ్యాయులు క్రింది ఉప అంశాల పై అవగాహన కలిగి ఉండాలి.
1.పర్యావరణ అనుకూల పదార్థాలు
18వ శతాబ్దంలో సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవానికి దారితీసింది.ఇది పర్యావరణ క్షీణత కూడా దారితీసింది. దీనివలన మానవుడు సుస్థిరమైన జీవితాన్ని గడపడం కష్టం అవుతుంది. మానవుడే కాదు ఇతర జీవరాశులపై ఈ ప్రభావం ఉంది. గాలి, నీరు, మరియు నేల వివిధ మార్గాలలో కలుషితము అయింది. రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం మరియు ఇతర రంగాలు ఈ కలుషితనికి కారణాలు.
సహజ వనరుల మితిమీరిన దోపిడీ కారణంగా వాతావరణ మార్పులు మనకు సవాలుగా మారాయి.
మనము పై సమస్యలను అధిగమించడానికి మనము కొన్ని పర్యావరణ హితమైన, అనుకూలమైన పదార్థాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వార్తాపత్రికలు, ఉపయోగించిన పుస్తకాలు, మొక్కలు నుండి తయారైన పదార్థాలు ఉదాహరణకు పత్తి బట్టలు, జనపనార ఉత్పత్తి బట్టలు ఉపయోగించినట్లు అయితే పర్యావరణ క్షీణతను అరికట్టవచ్చును మరియు పర్యావరణమును కాపాడుకోవచ్చును.దీనికి నమూనా లు తయారు చేసి ప్రదర్శనలను తయారుచేసి ప్రదర్శించడం వలన పర్యావరణ సృహను కలుగజేయవచ్చును.
2. ఆరోగ్యం-పరిశుభ్రత
ఈ అంశం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులలో, ఆరోగ్యం మరియు పోషక అవసరాలను ప్రభావితలు చేసే అంశాలను అవగాహన😂# కలిగించుట. కరోన వైరస్ covid-19 లాంటి విపత్తులను ఎదురుకోవటానికి నూతన సాంకేతికతను వినియోగించుకునుట మరియు వినూత్న ఆలోచనలు చేయుట.
ఈ ఉప అంశములు క్రింద ఈ క్రింది ప్రయోగాలు నమూనాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చు.
*ఆరోగ్యం మరియు పరిశుభ్రత, మానవుని పై ఎలా ప్రభావితము చూపుతుంది.
*రోగ నిరోధక శక్తి ని పెంచి, వ్యాధుల పై పోరాడే ఆహారము గురించి
*పారిశుధ్యంము శస్త్ర చికిత్స సమయములో ఉపయోగించే పరికరాలు, పదార్థాలు, మాస్కులు, PPE కిట్, మాస్కులు మొదలైన వాటిలో బయోడిగ్రేబుల్ మరియు నాన్ బయోడిగ్రేబుల్ పదార్థాలు వేరు చేయడానికి,తొలిగించడానికి గ్రామీణ పట్టణ ప్రాంతంలో అధునాతన సాంకేతికను వినియోగించుట.
*కరోన,చికెన్ గున్య,డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధులకు కారణాలు, నియంత్రించే విధానాలు లేదా మార్గాలు.
*అంటువ్యాధులను నివారించుటకు సంక్రమణం విచ్ఛిన్నం చేయడానికి వివిధ రకాల వినూత్నమైన చర్యలు.
*సంప్రదాయ మందులు వినియోగం మరియు ఉపయోగం పై ప్రదర్శనలు.
*శారీరక వ్యాయమం మరియు యోగ ఆరోగ్య ప్రయోజనాలు.
*సమతుల్య ఆహారం మరియు పోషక విలువలు కలిగిన ఆహార ప్రదర్శన
*సామాజిక దూరం పాటించడం పై అవగాహన కలిపించుట సామాజిక దూరంపాటించడము వలన కలిగే సమస్యలను అధిగమించడానికి వినూత్న పద్ధతులు
* కల్తీ ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ వస్తువుల ప్రభావం.
*గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో వైద్య సహాయము కొరకు సౌకర్యలు మరియు లింగ అంశాలు.
*స్వచ్ భారత్ అభియాన్ ,జాతీయ ఆత్మ నిర్బర్ భారత్ కుష్టు నిర్ములన కార్యక్రమలు/పథకాలు, విధానాల అమలు- వినూత్న మైన ఆలోచనలు.
*నాలెడ్జ్ బేస్డ్ అభివృద్ధి కొత్త శాస్త్రీయకతను అర్థం చేసుకోవడంలోబయో మెడికల్ సాంకేతికతను వినియోగించడం.
*ఆధునిక పరిశోధన లలో హోమియోపతి, ఆయుర్వేద లాంటి గురించి తెలిపిన వాస్తవాల ప్రదర్శన.
*జీవనశైలి మరియు దానితో సంబంధం మంచి మరియు చెడు ఆరోగ్యం పరిశోధనల ద్వారా తెలిపిన వాస్తవాలు ప్రదర్శన.
*సుస్థిరమైన అభివృద్ధి లో వ్యవసాయం మరియు ఆరోగ్యం బొమ్మ/ నమూనాల ప్రదర్శన.
*ఎరువులు, పురుగుల మందులు, హార్మోన్లు మరియు ఆహార రంగులు వాడడం వలన, మానవుని శరీరం పై రసాయన అవశేషాల ప్రభావం, బొమ్మల/ నమూనల ప్రదర్శన
* వికలాంగుల ను కరోన వైరస్ నుండి కాపాడడానికి వినూత్న నియంత్రణ చర్యలు, చికిత్స సాధనలు/సహయలు.
3 ఇంట రాక్టివ్
సాఫ్ట్ వేర్
*ఇంటరాక్టివ్ సాఫ్ట్ వేర్ ,ఉపాద్యాయులు మరియు పిల్లలు నూతన మరియు వినూత్న మైన ఆలోచనలతో టాయ్స్ డిజెన్ మరియు అభివృద్ధికి ఉపయోగ పడుతుంది.
*ఈ ఇంటరాక్టివ్ సాఫ్ట్ వేర్ టాయ్స్ తో పాటు టాయ్ పోగ్రామ్ డిజెన్ చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది.
*ఈ టాయ్ పోగ్రామ్ భవిష్యత్ కంప్యూటర్ పోగ్రామ్ కు ఉపయోగ పడుతుంది.
*టాయ్ పోగ్రామ్ ద్వారా nవ పదం కనుగొనుట, వర్గసమికరణానికి మూలాల కనుగొనుట, ఇచ్చిన సంఖ్య ప్రధాన సంఖ్య అవునా?కాదా?అని కనుగొనుట, ఓం నియమములో వోల్టేజ్,కరెంటు,నిరోధములను కనుగొనుట లాంటి సమస్యలకు సాధన కనుగొనవచ్చు.
ఈ ఎగ్జిబిషన్ లో ప్రోటో టైప్ టాయ్, వీడియో గేమ్స్, చిన్న టాయ్స్ కీలు బొమ్మల టాయ్స్ వాటిని డిజైన్ చేయడానికి అవసరము అయ్యే సాఫ్ట్ వేర్ లను ప్రదర్శించవచ్చును
*ప్రోటో టైప్ పరీక్ష చేయడానికి అవసరం అయ్యే సాఫ్ట్ వేర్ లను ప్రదర్శించవచ్చు
*టాయ్స్ అవసరమయ్యే instructions manual తయారు చేసి సాఫ్ట్ వేర్ ను ప్రదర్శించవచ్చును.
విద్యార్థులలో టాయ్ పోగ్రామ్ వలన సమస్యల పరిష్కారం, సృజనాత్మక, భావోద్వేగాల నియంత్రణ మరియు సామాజిక అభివృద్ధి కలుగుతుంది.
4 చారిత్రక అభివృద్ధి
ఆటల ద్వారా నేర్చుకోవడం పిల్లల అభివృద్ధి లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టాయ్స్ సమస్య పరిష్కారానికి, సైకో మోటార్ నైపుణ్యలు అభివృద్ధి చేయడం మరియు సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగ పడుతుంది.
భారత దేశంలో ప్రాచీన కాలం నుండి టాయ్స్ ఉన్నాయి, సాంప్రదాయ భారతీయ బొమ్మలు(టాయ్స్) నిజ జీవిత జ్ఞానంను ప్రతిబింబాలు మరియు ఇవి సరళమైనవి.
మనకు లభించే సాహిత్యం ప్రకారం టాయ్స్ మన సంస్కృతిని ప్రతిబింబించాయి, మనిషి మనస్సు మరియు శారీరకంగా ఆరోగ్యం ఉండడానికి సహకరించాయి.
మన ప్రాచీన సింధు నాగరికత కాలంలో కూడా టాయ్స్ ఉన్నాయి, ఇందులో వాలు కార్ట్ రాటిల్ లాంటి ఆట బొమ్మలు కూడా ఉన్నాయి.
కోల్పోయిన వారసత్వం మును సృష్టించడానికి వేదిక అవసరము, యువతరం ఈ బాధ్యతను తీసుకోవాల్సి ఉంది, ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ బొమ్మలు తిరస్కరించి సేంద్రియ బొమ్మల ప్రాముఖ్యత ను పెంచాల్సి ఉంది. దీనికి ఎంబేడెడ్ సైన్స్ ఉపయోగ పడుతుంది.
విద్యార్థులు టాయ్స్ అభివృద్ధి చేసేటప్పుడు 2 రకాలుగా బొమ్మలు చేయవచ్చును.
1స్టాటిక్ 2.డైనమిక్
స్టాటిక్ విభాగంలో బంకమట్టి, వెదురు, లోహాలు, కాగితం వంటి వాటిని ఉపయోగించి జంతువులు, పక్షులు, గాలి పటాల లాంటి బొమ్మల ను తయారు చేయవచ్చును
డైనమిక్ విభాగంలో కదిలే బొమ్మలు ,ధ్వని కాంతి ఉత్పత్తి చేసే బొమ్మలు కదిలే వాహనాలు, బొమ్మలు, రోబోట్లు మొదలైనవి.
ఈ బొమ్మలు సైన్స్ వ్ వివిధ భావాలు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల అభివృద్ధి లో ఉపయోగపడుతాయి
5 గణిత మోడలింగ్
గణిత మోడలింగ్ రోజువారీ సమస్యల సాధనకు ,పర్యావరణ సంబదిత సమస్యల సాధనకు ఉపయోగ పడుతుంది. వాతావరణం అంచనాకు, భ్రమనం మరియు పరి భ్రమనం, తోక చుక్కలు, ఉల్కలు, చిన్నఉపగ్రహల కక్ష్య మార్గాన్ని అంచన వేయడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
అంటూ వ్యాధులు సంబంధించినప్పుడు అది ఎలా వ్యాప్తి చెందుతుంది గణిత మోడలింగ్ తెలుపుతుంది
యుద్ధం తరువాత జరిగే వినాశక పరిస్థితులు ఉదాహరణకు అనుపేళ్ళు అంచనా వేయడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
మానవుని శరీరం పై మందుల ప్రభావాన్ని, గుండె, మెదడు, ఊపిరితిత్తులు,మూత్ర పిండాలు, పనిచేసే స్థితిని వివరించుటకు గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
క్యాన్సర్ చికిత్స, గాయనమూనా, కణజాలం నిర్మాణము లో గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
జీవక్రియ,కణాంతరా జీవరసాయన ప్రతి చర్యలను వివరించుటకు గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
డేటా నిర్వహణ మరియు సమాచారాన్ని కూడా గణిత మోడలింగ్ ఉపయోగపడుతుంది
నగర ప్రణాళిక లో గణిత మోడలింగ్ పాత్ర ,అవాంచిత భవిషత్తును అర్థం చేసుకోవడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
◆సైన్స్ ఎగ్జిబిషన్ల లో భాగంగా, అన్ని యాజమాన్యాల విద్యార్థుల కోసం తేదీ 28.02.2021 న సెమినార్ నిర్వహించబడును
సెమినార్‌కు అంశం:
"డైలీ లైఫ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు"
సెమినార్ కు సంబంధించి పాల్గొనే విద్యార్థుల వివరాలు
తేదీ 25.02.2021 లోగా dso గారికి 9948539212 కు whatsup ద్వారా పంపాలి.
★★గమనిక★★
1. అన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ,స్థానిక, ఆశ్రమ,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
ప్రదానోపాధ్యాయులు
పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థులు తప్పని సరిగా పాల్గొనేల ప్రోత్సహించవలిసిందిగా కొరనైనది.
◆MEO s మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల HS/UPS ప్రదానోపాధ్యాయు
లకు సమాచారం అందించి
ఈ ఎక్సిబిషన్ సక్సెస్ కావడానికి కృషి చేయవలిసిందిగా సూచించనైనది.
◆EXHIBITS రిజిస్ట్రేషన్ మరియు అప్లోడ్ చేయడానికి కావలిసిన సమాచారం కొరకు క్రింది ప్రొఫార్మ ను చూడగలరు.
వివరాలకు DSO ను 9948539212 కు సంప్రదించగలరు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల
JNNSMEE 2021ఆన్లైన్ ప్రదర్శన:
గైడ్ టీచర్లకు సూచనలు
సమయం చాలా తక్కువ ఉన్నందున త్వరపడి
ఈ ప్రదర్శన ఆన్లైన్ Google Forms ద్వారా జరుగుతుంది
1.ఎగ్జిట్ కు సంబంధించిన ఫోటో, ఆడియో, వీడియో ఫైల్స్ ను మీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
2.విద్యార్థి వివరాలు: పేరు, తరగతి, జెండర్, పాఠశాల పేరు
3.ఎక్సిబిట్ వివరాలు: subtheme పేరు,ఎక్సిబిట్ పేరు
4.గైడ్ టీచర్ వివరాలు: పేరు, హోదా,సెల్ నంబర్, ఈమెయిల్.
5.250 పదాల తో కూడిన రైట్ అప్ పేపర్ పై విద్యార్ధి ఫొటో, ఎక్సిబిట్ ఫొటో అతికించి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి*
6.ఎక్సిబిట్ కు సంబంధించిన ఆడియో ఫైల్ అప్లోడ్ చేయాలి
7.ఎక్సిబీట్ కు సంబంధించిన విడియో 2నిమిషాలు/20ఎంబి
నిడివి కల్గిన ఫైల్ అప్లోడ్ చేయాలి*
8.విద్యార్థులచే చాలా సార్లు రిహార్సిల్స్ చేయించి 1/3/2021 తారీకు లోపు అప్లోడ్ చేయాలి.
9.ప్రతిదీ చివరి తేదీ వరకు వేచి చూసి అప్లోడ్ చేయడం వల్ల ఎడిట్ చేసుకునే సమయం లేకపోవడం వలన సమస్యలు వస్తాయి. అందుకే నిర్ణీత సమయం లో చేసుకుంటే బాగుంటుంది.
10.ఎవరైనా టెక్నికల్ సహాయం అవసరమైతే మన కపిల నరేష్ సార్ 9700554431 విద్యసిరి ఛానల్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించగలరు. జిల్లా సైన్స్ అధికారి రాజన్న సిరిసిల్ల
No comments:
Post a Comment