*💥ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ:*
*🚀అంతరిక్ష సాంకేతికతపై తరగతులు🚀*
*🔭కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి, అంతరిక్షంపై అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇస్రో పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) డెహ్రాడూన్ వారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేయగా తరగతుల నిర్వహణకు ఈ నెల 5 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవగా 30వ తేది వరకు అవకాశం ఉంది.*
*🔷ఈ నెల 31 నుంచి తరగతులు : 2007 నుంచి ఇస్రో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కోర్సులు ఇప్పటి వరకు 76 పర్యాయాలు నిర్వహించారు. ఇందులో దేశ వ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సారి కూడా విజయ వంతంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అంతర్జాలంలో https:///www.iirs.gov.in/ EDUSAT-news లింక్ ద్వారా చరవాణి, జీమెయిల్, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. నమోదు చేసుకున్న వారికి ఈ నెల 31 నుంచి వచ్చే 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో 70 శాతం హాజరు నమోదు ఉంటూ ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్ ద్వారా ధృవపత్రం అందించనున్నారని రాజన్న జిల్లా సైన్సు అధికారి వి. ఆంజనేయులు తెలిపారు.*
*● ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు 7000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులున్నారు. వీరిలో 9 నుంచి 12వ తరగతి వరకు గణితం, భౌతిక, జీవశాస్త్రం,భౌగోళిక శాస్త్రం, బోధించే వారు 2700 మందికి పైగా ఉంటారు. ఇలాంటి వారందరికీ అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు అనే అంశంపై తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి, వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించేలా తరగతులు ఉంటాయి.*
No comments:
Post a Comment