Saturday, May 8, 2021

NGC Academic year 2020-21 Grants releasing

జాతీయ హరిత దళం కార్యక్రమాలకు నిధులు మంజూరు
5 వేల చొప్పున 100 పాఠశాలలకు  నిధుల విడుదల

గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు జాతీయ హరిత దళం NGC ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ డి రాధా కిషన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తలచి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న జాతీయ హరిత దళం (నేషనల్ గ్రీన్ కోర్) ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర హరిత దళం మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంజూరు చేసింది
2020 21 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ గ్రీన్ కోర్  పథకం కు ఎంపికైన ప్రతి పాఠశాలకు ఐదు వేల రూపాయల చొప్పున  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 100 పాఠశాలలకు  5 లక్షల రూపాయలు  మంజూరు చేయడం జరిగింది. ఈ ఐదువేల రూపాయలను ఉపయోగించి పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికి గాను 8వ తరగతి విద్యార్థులను ఐదు టీములుగా చేసి, ప్రతి టీమ్ లో ఐదుగురు విద్యార్థులను తీసుకొని అవి 1.నీటి నిర్వహణ 
2.నేల నిర్వహణ 
3.శక్తి నిర్వహణ 4.జీవవైవిద్యం 
5.పాఠశాల సుందరీకరణ
ఈ కమిటీల ద్వారా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించ్చాలి .విద్యార్థి స్థాయి నుంచే వాతావరణంలో కలిగే మార్పులను అనుగుణంగా నడుచుకుని పర్యావరణాన్ని కాపాడుకునే భావితరాన్ని తయారుచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు.

ఎన్ జి సి కోఆర్డినేటర్ వాయిస్
పాఠశాలల్లో ఈకో క్లబ్స్(Eco Clubs) సమర్థవంతంగా పనిచేయాలి
 జిల్లా హరిత దళం సమన్వయకర్త (NGC Coordinator) వి. ఆంజనేయులు  మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించుట కై పాఠశాలల్లో NGC క్యాలెండర్ లో దాదాపుగా ప్రతి నెల ఒక కార్యక్రమం ఉన్నది 
మార్గదర్శకాలు
పాఠశాలలో జాతీయ హరిత దళం కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది
మొక్కల పెంపకం, తరగతిగదిలో నీలిరంగు బుట్టలు ఏర్పాటు చేయుటకు  వెయ్యి రూపాయలు ఖర్చు చేయనున్నారు. మొక్కలకు ఎరువు కోసం కంపోస్టు పిట్ ఏర్పాటుకు వెయ్యి రూపాయలు, పర్యావరణ ఉత్సవాలు బ్యానర్ కు రెండు వేల రూపాయలు, గ్రీన్ టీచర్ కు మరియు ఎన్జిసి విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ కొరకు వెయ్యి రూపాయలు ఖర్చు చేయనున్నారు
విద్యా సంవత్సరం అంతా NGC కార్యక్రమాలు 
దీనికి అనుగుణంగా ప్రత్యేక NGC క్యాలెండర్ తయారుచేసి ఇవ్వడం జరిగింది
జనవరి 15 ,31 రోజులలో ఆయిల్ పరిరక్షణ దినోత్సవం
ఫిబ్రవరి 2న ప్రపంచ నేలల దినోత్సవం
ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం
మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
మార్చి 21 ప్రపంచ అడవి దినోత్సవం 
మార్చి 23 ప్రపంచ జల దినోత్సవం
ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం
మే 22న ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఆగస్టులో మట్టి గణపతి మహా గణపతి
 వృక్షా రక్ష బంధన్
సెప్టెంబర్ 16 న ప్రపంచ ఓజోన్ దినోత్సవం
నవంబర్ 14న బాలల దినోత్సవం
డిసెంబర్ 3న ప్రపంచ కాలుష్య వ్యతిరేక దినోత్సవం
వీటితో పాటు పర్యావరణ రహిత హోలీ, దీపావళి, బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహించాలి.
కావున ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా  పాఠశాలల్లో ఈకో క్లబ్స్(Eco Clubs) ద్వారా నిర్వహించుకున్నప్పుడు మాత్రమే
స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛ తెలంగాణ స్వచ్ ఇండియా వైపు అడుగులు వేగంగా పోతామని దిశానిర్దేశం చేయడం జరిగింది.
*జిల్లా హరిత దళం సమన్వయకర్త
రాజన్న సిరిసిల్ల*

No comments:

Post a Comment