Year abstract
1. *ఇంటింటా ఇన్వెంటర్ ఆన్ లైన్ ప్రదర్శన*
జూలై 20 నుండి 31 వరకు జిల్లా నుండి 11 ప్రదర్శనలు నమోదు చేసుకోగ ప్రదర్శన నుండి మూడు ప్రదేశాలు ఉత్తమ ప్రదర్శనలగా ఎంపిక కావడం జరిగింది అవి మల్టిపుల్ కోకోనట్ విద్యార్థి పేరు షకీల్ మినీ లోడర్ నవీన్ కుమార్ విత్తనాలు వేస యంత్రం బి. సరయు
2. *సైన్స్ ఉపాధ్యాయులకు ICT ఆన్లైన్ శిక్షణ*
జిల్లాలో మొట్టమొదటిసారిగా తరగతి బోధనలో టెక్నాలజీ వినియోగం పై
ఆగస్టు నెలలో 24 నుంచి 28 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫిజికల్ సైన్స్ ,బయాలజికల్ సైన్స్ టీచర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్ పాఠాలు ఏ విధంగా బోధించాలి అనే అంశంపై గూగుల్ అకౌంట్ నిర్వహణ, గూగుల్ ఫామ్ నిర్వహణ, జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ, గూగుల్ సీట్, వీడియో మేకింగ్, గూగుల్ క్లాస్ రూమ్ నిర్వహణ, ఇన్స్పైర్ అవార్డ్స విద్యార్థుల నామినేషన్ పై అవగాహన ఇలా పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
3. *ఆన్లైన్ ఓజోన్ సెమినార్ డే నిర్వహణ*
సెప్టెంబర్ నెలలో 37వ ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ లో నిర్వహించిన సెమినార్లో తుమ్మ సిద్ధార్థ పట్న సుమేద జి అక్షయ లు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి పొందారు.
4. *సహాయ సాంకేతిక ఆవిష్కరణలు ప్రదర్శన*
అక్టోబర్ 14 రోజున సహాయ సాంకేతిక ఆవిష్కరణల ప్రదరన లకు అవగాహన నిర్వహించడం జరిగింది.
5. *రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తా* నవంబర్ 2వ తారీఖు నుండి 7 తారీఖు వరకు రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహం వాటర్ ఆడిటింగ్ మరియు కార్బన్ ఫ్రూట్ ప్రింట్ లపై ప్రాజెక్ట్ నిర్వహణ కార్యక్రమం జరిగింది.
1.గృహ అవసరాల కొరకు వాడుతున్న నీటిని గణించడం మరియు ఇంటి తోట వాడకానికి అవసరమైన నీటి గణన
2.ఏవైనా మూడు పంటల వినియోగానికి అవసరమైన నీటిని గణించడం
3.కార్బన్ ఫ్రూట్ ప్రింట్ గణన
6. *తెలంగాణ ఇన్నోవేషన్ ఛాలెంజ్*
తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ద్వారా నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో మన జిల్లా నుండి 225 కొత్త ఐడియాలను నమోదు చేయడం జరిగింది అందులో నుండి టాప్ 125 సెమీఫైనల్ వరకు 5 ఐదు ఐడియాలు ఎంపిక కావడం జరిగింది.
7. *ఆన్లైన్ ద్వారా ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన*
డిసెంబర్ 5 నుండి 10 వరకు ఆన్లైన్ ద్వారా జిల్లాస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది మన జిల్లా నుండి 35 పాల్గొనడం జరిగింది అందులో నుండి ఐదు ఉత్తమ ప్రదర్శనలను
రాష్ట్ర స్థాయి కి పంపించడం జరిగింది.
1.ఆఫర్ డబుల్ టాయిలెట్ తునికి ఆకాష్
2.మల్టిపుల్ అగ్రికల్చర్ మెషిన్ బి సరయు
3.బిల్డింగ్ సీలింగ్ క్లీనర్ ఇ.నవదీప్
4.ఎరువు వేసే పరికరం m. చంద్రశేఖర్
5.పెడల్ టాయిలెట్ ప్రెషర్ చిలువెరు శ్రివర్దన్
8. *ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్*
ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవ సందర్భంగా రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ నిర్వహణ గూర్చి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
9. *విద్యార్థులకు సైన్స్ సెమినార్*
రేపు జరగబోయే సైన్స్ డే సందర్భంగా
*సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్* అనే అంశంపై విద్యార్థినీ విద్యార్థులకు జూన్ యాప్ ద్వారా ఆన్లైన్ సెమినార్ రెండు గంటలకు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కు
10 మంది విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి
10 *జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ప్రదర్శన*
మార్చ్ నెలలో ఒకటి నుండి మూడో తారీకు వరకు జరిగే ఆన్లైన్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ జరగబోతుంది దీనికిగాను ఫిబ్రవరి 15 నుండి 28 వరకు ప్రదర్శన నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
No comments:
Post a Comment