Saturday, December 4, 2021

స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021

*స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021 ను విజయవంతం చేయండి*.          *....గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆదేశించారు*                                            తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(TSIC), పాఠశాల విద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021 కార్యక్రమం కు సంబంధించిన పోస్టర్ ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి గారు ఆవిష్కరించారు.* ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ TSIC, పాఠశాల విద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో 2021వ సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్ధిని విద్యార్ధుల సృజనాత్మక ఆలోచనలను స్వీకరించి ఉత్తమ మైన ఆలోచనలను ఎంపిక చేసి వాటి ఆచరణ రూపం ఇచ్చే ఈ కార్యక్రమంలో గతసంవత్సరం  4041 ప్రభుత్వ పాఠశాల లు,23881 స్టూడెంట్స్, 5091 ప్రభుత్వ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని 7093 సృజనాత్మక ఆలోచనలను నమోదు చేయడం జరిగింది, దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది, *సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలబాలికల ఆలోచనలకు రూపం ఇచ్చే అవకాశం కల్పించవలసిన బాధ్యత ప్రతి పాఠశాల కు ఉందని నిర్ధిష్ట షెడ్యూల్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి.*
గత సంవత్సరం రాజన్న సిరిసిల్ల  జిల్లా నుండి Grannd finale కు 5 ideas select కావడం జరిగంది., గత అనుభవం దృష్ట్యా మరింత మెరుగైన ఫలితాలు స్వంతం చేసుకోవాలి, సంబంధిత షెడ్యూల్ ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి శ్రీ దేవసేన గారు విడుదల చేశారు. దీనిని జిల్లా లోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని  అందరు విద్యార్థులకు అందేలా చేయాల్సిన బాధ్యత మిపై ఉంటుంది అని ఆదేశించారు. 
 *ఈ క్రింది కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం అందరూ పాల్గొనాలి*
ప్రక్రియ లో తొలిమెట్టు గా జిల్లాలోని అన్ని యాజమాన్యాల అన్నిరకాల పాఠశాలల *హైస్కూల్ హెడ్స్* తమ పాఠశాల నుండి *ఒక టీచర్ ను SIC కార్యక్రమానికి ఎంపిక చేసి* క్రింది గూగుల్ form ను *26 అక్టోబర్,2021* లోగా fill చేసి టీచర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.పాఠశాలవిద్యాశాఖ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఏ ఒక్క పాఠశాల కు మినహాయింపు లేదు.
https://bit.ly/SIC2021Register
*టీచర్ ట్రైనింగ్:*
Teachers కి 30.10.2021 నుండి12.11.2021ల మధ్య టీచర్స్ కి ఆన్లైన్ విధానంలో ప్రక్రియ ను గురించిన శిక్షణ వుంటుంది.
*టీచర్స్ ఆన్లైన్లో కోర్స్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తి చేయుట*:
13.11.2021 to 19.11.2021
*స్టూడెంట్స్ ఆన్లైన్ కోర్స్ మరియు idea సబ్మిషన్:*
22.11.2021 to17.12.2021
*Evaluation మూల్యంకనం*:
17.12.2021 to 31.12.2021
*జిల్లా స్థాయి ప్రోటోటైపింగ్ క్యాంప్:*
02.01.2022 to 25.01.2022
*జిల్లా స్థాయి ప్రదర్శన:*
27.01.2022 to 31.01.2022
*గ్రాండ్ ఫినాలే:*
5/6 ఫిబ్రవరి,2022
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి Dr. D.రాధా కిషన్ మరియు జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. ఆంజనేయులు పాల్గొన్నారు.   *జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల*

No comments:

Post a Comment