అంతర్జాతీయ సృజనాత్మకత, ఇన్నోవేషన్ దినోత్సవం ఈరోజు అంతర్జాతీయ సృజనాత్మకత మరియు ఇన్నోవేషన్ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ సిరిసిల్లలో వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న టువంటి విద్యార్థినీ విద్యార్థులకు (creativity, invention entrepreneurship, startup,) అవగాహన కల్పించడం జరిగింది. అంతర్జాతీయ సంస్థ (UNO) నిర్ణయం మేరకు ఏప్రిల్ 21 న రోజున ప్రపంచంలోని దేశాలు అన్నిట్లో క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వివిధ రంగాల్లో సృజనాత్మకత మరియు ఇన్నోవేషన్ గురించి అవగాహన కల్పించడం కోసం చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TSIC) ఆధ్వర్యంలో తెలంగాణ ఎకడమిక్ స్కిల్ నాలెడ్జ్ TASK ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఈ అంశంపై ముఖ్య వక్త విచ్చేసిన వి.ఆంజనేయులు జిల్లా సైన్స్ అధికారి రాజన్న సిరిసిల్ల గారు. అవసరం ఆవిష్కరణకు దారితీస్తుందని , ఆవిష్కరణలు చేయుటకు పెద్ద ,పెద్ద కోట్ల రూపాయల తో తయారుచేసిన ప్రయోగశాలలు కాదు. నిత్యం మన చుట్టూ పరిసరాల్లో జరుగుతున్న ఈ సమస్యలకు మన మన పరిధిలో సృజనాత్మకతతో ఆలోచించి పరిష్కార మార్గాలు కన పెట్టగలిగితే చాలా ఆవిష్కరణలకు బీజం వేసినట్లు అవుతుంది తెలిపారు. తద్వారా ఇంటింటికి ఒక ఆవిష్కర్త బయలుదేరి వీలైనన్ని పరికరాలు కన్న పెట్టగలిగితే మన తెలంగాణ, తద్వారా మన దేశ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. *తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వివిధ వర్గాల వారికి పలురకాల ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి పాఠశాల విద్యార్థులకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ఆవిష్కరణ వైపు అడుగులు వేయటం కు ఇంటింటా ఎన్నో మేటర్, టీచర్స్ కొరకు స్కూల్ టీచర్ రేసిపోటరీ, టెక్నికల్ విద్యార్థుల కొరకుT-Hub,We-Hub వీటన్నింటినీ ఉపయోగించుకొని, మీరందరూ ఈ వైపుగా ఆలోచించాలని మీరంతా రాబోయే కాలంలో ఆవిష్కరణ కర్తలుగా మార్పు చెందాలని. మీరంతా ఉద్యోగాలు కోసం వేచి చూడడం కాదు అందరూ స్టార్ట్ అప్ ద్వారా ఇతరులకు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment