రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థిని జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎంపిక తెలంగాణ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, హైదరాబాద్,(TS SCERT) వారు 16-04-2022 రోజున ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ 49 వ(JNNSMEE) సైన్స్ ఎగ్జిబిషన్-2022. లో ఆరు అంశాలకు 33 జిల్లాల నుండి జిల్లా నుండి 6 ప్రదర్శనలు మొత్తం 198 ఎగ్జిబిట్స్ పాల్గొన్నాయి. మన జిల్లా నుండి 6 అంశాలలో ఆరుగురునీ జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి పంపించాను. అందులో నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లో
రవాణా (Transport)విభాగంలో జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి CH. వైష్ణవి గైడ్ టీచర్,CH. సుధాకర్ సహాయంతో చేసినటువంటి మెట్లపై నుండి గ్యాస్ సిలిండర్, వాటర్ బబుల్, బియ్యం బస్తా, చేతకాని ముసలి వారిని, ఇలా బరువులను సులభంగా తీసుకుపోయే ట్రాలీ ప్రదర్శించగా జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందారు.
ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాధికారి, సెక్టోరల్ కోఆర్డినేటర్ వి శైలజ, మండల విద్యాధికారి బి. భన్నాజి, జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు, అభినందనలు తెలియజేశారు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల
No comments:
Post a Comment