Monday, January 16, 2023

ఇన్స్పైర్ నామినేషన్ల మరియు ఆన్లైన్ ఎగ్జిబిషన్ అప్లోడింగ్ పై అవగాహన కార్యక్రమం August 17th

జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల.

ఇన్స్పైర్ నామినేషన్ల మరియు ఆన్లైన్ ఎగ్జిబిషన్ అప్లోడింగ్ పై అవగాహన కార్యక్రమం

👉2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనది.

👉మన విద్యార్థులు గత సంవత్సరం 111 ఇన్స్పైర్ అవార్డులను సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా అత్యధికంగా నామినేషన్లు పొందుట కొరకు ఆన్లైన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతోంది.

👉దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల, అన్ని యాజమాన్యాల (ప్రైవేటు మరియు ప్రభుత్వ, ఏయిడెడ్, మోడల్, కె.జి.బి.వి., రెసిడెన్షియల్)  ప్రధానోపాధ్యాయులు, భౌతిక రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రాలు, గణితం మరియు ఇన్స్పైర్ పై ఆసక్తి గల ఉపాధ్యాయులు అందరికి అవగాహన కార్యక్రమం zoom platform మరియు YouTube link  ద్వారా 👉 29.08.2022 మధ్యాహ్నం 2గo నుండి 4 గం వరకు నిర్వహించబడును.

ఈ అవగాహన కార్యక్రమంలో  పాస్వర్డ్ చేంజ్, నామినేషన్ ల కొరకు వినూత్న ఆలోచనల ఎంపిక మరియు అప్లోడ్ గురించి తెలియజేయనున్నారు.

👉గూగుల్ ఫామ్ ద్వారా హాజరు వివరాలు నమోదు చేయబడును.                           Note  మీటింగ్ యూట్యూబ్ లింక్.👇   https://youtube.com/c/vidyasiri                     జూమ్ లింక్ ఉదయం 10గo లకు అన్ని గ్రూప్ లలో పోస్ట్ చె్యబదుతుంది.

  * ఇన్స్పైర్ అవగాహన సదస్సు*

ఈ రోజు ఈరోజు జూన్ ప్లాట్ ఫామ్ మరియు విద్యా సిరి ఛానల్  యూట్యూబ్ లింక్ ద్వారా ఆన్లైన్ మీటింగ్ ఇన్స్పైర్ manak అవార్డు2022-23  నామినేషన్ల కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ  సమావేశాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాధా కిషన్ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఇన్స్పైర్ మనకు 2022- 23 నామినేషన్ల ప్రక్రియ ను వేగవంతం చేస్తూ దసరా సెలవుల కన్నా ముందే అనగా  సెప్టెంబర్ 25 తేదీ లోపు పూర్తిచేయాలని ఆదేశించడం అయినది. గత రెండు సంవత్సరాలలో వివిధ సైన్స్ కాంపిటీషన్ లలో సాధించిన విజయాలను  సమీక్షిస్తూ  ఈ విద్యా సంవత్సరానికి గాను మరింత ఉత్సాహంగా అన్ని సైన్స్ కార్యక్రమాలలో పాల్గొని  జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచే విధంగా పని చేయాలని సూచించారు. నూతనత్వం, సృజనాత్మకతతో ఉండి  సామాజిక అవసరాలను తీర్చే విధంగా  విద్యార్థులచే వివిధ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రాజెక్టులను ఎన్నుకొని ప్రతి పాఠశాల నుండి 5 బెస్ట్ ఐడియాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించడం అయినది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యాధికారులు, ZP/Govt ప్రధానోపాధ్యాయులు, KGBV స్పెషల్ ఆఫీసర్,  TSMS ప్రిన్సిపాల్స్ , ఫిజికల్ సైన్స్ ,బయో సైన్స్, గణిత ఫోరం అధ్యక్షులు, సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ అందరూ సమన్వయంతో పనిచేసి ఈ సంవత్సరం మన జిల్లా నుండి  1000 వినూత్న ఐడియాలను ఇన్స్పైర్ నామినేషన్ చేయాలని ఆదేశించారు.

ఇట్టి సమావేశ సమన్వయకర్త డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వి. వంతడుపుల ఆంజనేయులు, MEO లు D. రఘుపతి, శ్రీనివాస్ దీక్షితులు అన్ని ఉన్నత పాఠశాలల   ప్రధానోపాధ్యాయులకు, కస్తూరిబా పాఠశాలల స్పెషల్ ఆఫీసర్స్, తెలంగాణ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్స్,ఫిజికల్ సైన్స్,బయో సైన్స్ మరియు మ్యాథ్స్ ఫోరం అధ్యక్షులు, సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్, సైన్స్    ఉపాధ్యాయులు మొత్తం 360 కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి రాజన్న సిరిసిల్ల.











ఆన్లైన్ రాష్ట్రస్థాయి జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-(JNNSMEE-2022) April 4th2022

 ఆన్లైన్ రాష్ట్రస్థాయి జవహర్ లాల్  నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-(JNNSMEE-2022)                            అర్హులు.                            ఇంతకుముందు  జిల్లా స్థాయి ఆన్లైన్ ఎక్సిబిషన్ 15-03-2022 వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారు  1. *పర్యావరణ స్నేహపూర్వక పదార్థం(Eco Friendly Material).             జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ వేములవాడ నుండి K. వినీల తయారు చేసినటువంటి పర్యావరణ ఇటుక (ఎకో బ్రిక్)

2. *ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత(Health and Cleanliness).            జెడ్ పి హెచ్ ఎస్ దమ్మన్న పేట నుండి S. అశ్విత తయారు చేసిన ఆంటీ పాండమిక్ డిసేబుల్ ఫ్రెండ్ వాష్ బేసిన్

3. * సాఫ్ట్‌వేర్ అండ్ ఆప్స్(Software and Apps).                                 టి ఎస్ ఎం ఎస్ నామాపూర్  నుండి R. అఖిల బ్లూ టూత్ హోమ్ ఆటోమేషన్ ఫర్ ఎలక్ట్రికల్ డివైసెస్

4. *రవాణా  (Transport).                       జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి CH. వైష్ణవి చేసినటువంటి మెట్లపై బరువులను సులభంగా తీసుకుపోయే ట్రాలీ

5.*పర్యావరణం- సుస్థిర మార్పులు లు(Environmental & Claimate  Changes).         జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ శివనగర్ నుండి J. హేమంత్ తయారుచేసిన ఫుడ్ గ్రైన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ రైన్ (ధాన్యము తడవకుండా రక్షించే పరికరం)

6. *గణిత మోడలింగ్,(Mathematical Modelling)                         జడ్పిహెచ్ఎస్ ముచ్చర్ల నుండి K.శ్రుతకీర్తి తయారుచేసిన angle subtended by arc                                                                               వీరు తప్పనిసరిగా తేదీ  : 10-4-2022 వరకు  ప్రాజెక్టుకు సంబంధించిన writeup,  ఫోటో, వీడియో  ను మరింత మెరుగు పరుచుకుని ఈ క్రింది   https://forms.gle/g63zx2TtZ6i5RGSE7  గూగుల్ ఫామ్ లింకులో అప్లోడ్ చేసి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనవలసిందిగా ఆదేశించనునది. మరియు సైన్స్ సెమినార్  తేదీ  :13-4-2023 ఉదయం 10.30 కు  ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. అందుకు అర్హత పొందిన K. స్రవంతి (జూనియర్ ఇంటర్,TSEMRS Yellareddypet) ఇంటర్నెట్ సౌకర్యం చూసుకొని PPT presentation  పాల్గొనవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకై జిల్లా సైన్స్ అధికారి ని 9948539212 ద్వారా సంప్రదించగలరు. 

జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల

































ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమం August 15th

 వినూత్న  ఆవిష్కరణలకు ఆహ్వానం 

గత 3 సంవత్సరాలుగా ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్ లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుంది. విద్యార్థులు, ఇంజనీర్లు, సైంటిస్ట్స్ కాకుండా ప్రతి  ఇంట్లో  ఇన్నోవేటర్ ను గుర్తించుట కొరకు,  పౌరులు మరియు ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ  ప్రదర్శన ద్వారా తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలు నుండి 

ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల మరియు వర్గాల ఆవిష్కరణలు ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాల writeup , రెండు నిమిషాల వీడియోను , 4 ఫోటోలతో  దరఖాస్తులను 9100678543 కు వాట్సప్ ద్వారా ఆగస్టు 5 తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందులో నుండి వినూత్నంగా ఉన్న ఆవిష్కరణ ఎంపిక చేసి  ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించడం జరుగుతుంది..  క్రిందటి సంవత్సరం 15 ఆవస్కరణలు      రిజిస్ట్రేషన్ చేసుకోగా  7 ఆవిష్కరణలు రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ ప్రదర్శనకు ఎంపిక అయినాయి. అవి 1. ఆద ఆండ్ ట్రిప్ ఆప్.  బి.బాలరాజు 2 . మల్టిపుల్ అగ్రికల్చర్  బ్యాగ్ .U. కీర్తి

3.Covid umbrella.E .కీర్తన 4. ఫిజికల్ డిస్టెన్స్ ఐడి కార్డ్ B.స్నేహ

5.Safty bus G.అనిల

6.S.Naveen కుమార్ , EASY MOVER

7.V.Maheshchandra. Mobile&Afrodable Toilet. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని గౌరవ కలెక్టర్ అనురాగ్ జయంతి గారి ఆదేశాల మేరకు వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతున్నాం.... వంతడుపుల ఆంజనేయులు జిల్లా సైన్స్ అధికారి

*జిల్లా విద్యాశాఖ

రాజన్న సిరిసిల్ల*