Monday, January 16, 2023

ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమం August 15th

 వినూత్న  ఆవిష్కరణలకు ఆహ్వానం 

గత 3 సంవత్సరాలుగా ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్ లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుంది. విద్యార్థులు, ఇంజనీర్లు, సైంటిస్ట్స్ కాకుండా ప్రతి  ఇంట్లో  ఇన్నోవేటర్ ను గుర్తించుట కొరకు,  పౌరులు మరియు ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ  ప్రదర్శన ద్వారా తెలంగాణలోని 33 జిల్లాల ప్రజలు నుండి 

ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల మరియు వర్గాల ఆవిష్కరణలు ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాల writeup , రెండు నిమిషాల వీడియోను , 4 ఫోటోలతో  దరఖాస్తులను 9100678543 కు వాట్సప్ ద్వారా ఆగస్టు 5 తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందులో నుండి వినూత్నంగా ఉన్న ఆవిష్కరణ ఎంపిక చేసి  ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించడం జరుగుతుంది..  క్రిందటి సంవత్సరం 15 ఆవస్కరణలు      రిజిస్ట్రేషన్ చేసుకోగా  7 ఆవిష్కరణలు రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ ప్రదర్శనకు ఎంపిక అయినాయి. అవి 1. ఆద ఆండ్ ట్రిప్ ఆప్.  బి.బాలరాజు 2 . మల్టిపుల్ అగ్రికల్చర్  బ్యాగ్ .U. కీర్తి

3.Covid umbrella.E .కీర్తన 4. ఫిజికల్ డిస్టెన్స్ ఐడి కార్డ్ B.స్నేహ

5.Safty bus G.అనిల

6.S.Naveen కుమార్ , EASY MOVER

7.V.Maheshchandra. Mobile&Afrodable Toilet. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని గౌరవ కలెక్టర్ అనురాగ్ జయంతి గారి ఆదేశాల మేరకు వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతున్నాం.... వంతడుపుల ఆంజనేయులు జిల్లా సైన్స్ అధికారి

*జిల్లా విద్యాశాఖ

రాజన్న సిరిసిల్ల*


























No comments:

Post a Comment