జోహార్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-2022 విజయవంతం శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కొరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (JNNSMEE-2022) జిల్లా స్థాయి ఎక్సిబిషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో
1. అన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ,స్థానిక, ఆశ్రమ,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
1. *పర్యావరణ స్నేహపూర్వక పదార్థం(Eco Friendly Material). జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ వేములవాడ నుండి K. ఆ నీల తయారు చేసినటువంటి పర్యావరణ ఇటుక (ఎకో బ్రిక్)
2. *ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత(Health and Cleanliness). జెడ్ పి హెచ్ ఎస్ దమ్మన్న పేట నుండి S. అశ్విత తయారు చేసిన ఆంటీ పాండమిక్ డిసేబుల్ ఫ్రెండ్ వాష్ బేసిన్
3. * సాఫ్ట్‌వేర్ అండ్ ఆప్స్(Software and Apps). టి ఎస్ ఎం ఎస్ నామాపూర్ నుండి R. అఖిల బ్లూ టూత్ హోమ్ ఆటోమేషన్ ఫర్ ఎలక్ట్రికల్ డివైసెస్
4. *రవాణా (Transport). జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి CH. వైష్ణవి చేసినటువంటి మెట్లపై బరువులను సులభంగా తీసుకుపోయే ట్రాలీ
5.*పర్యావరణం- సుస్థిర మార్పులు లు(Environmental & Claimate Changes). జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ శివనగర్ నుండి J. హేమంత్ తయారుచేసిన ఫుడ్ గ్రైన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ రైన్ (ధాన్యము తడవకుండా రక్షించే పరికరం)
6. *గణిత మోడలింగ్,(Mathematical Modelling) జడ్పిహెచ్ఎస్ ముచ్చర్ల నుండి K.శ్రుతకీర్తి తయారుచేసిన angle subtended by arc ఇలా ఆరు అంశాలవారీగా 120 ఎక్స్బిట్స్ ఆన్లైన్ ద్వారా తేదీ 3-03-2022 నుండి 20-32022 వరకు ప్రాజెక్టుకు సంబంధించిన writeup, ఫోటో, వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.24-03-2022 రోజున జడ్జిమెంట్ చేసి ఫలితాలు జిల్లా విద్యాధికారి Dr.D. రాధా కిషన్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి అంశం ఒకరు మాత్రమే సెలెక్ట్ కాబడి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ఆరు అంశాలకు ఆరుగురు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని అని తెలియజేశారు. ఎంపిక కాబడిన వీరు మరింత ప్రాజెక్టు ను మెరుగుపరుచుకుని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయిలో ఎంపిక కాబడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరనైనది. అదేవిధంగా గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాధికారి, సెక్టోరల్ కోఆర్డినేటర్ వి శైలజ, జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు అభినందనలు తెలియజేశారు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల.
49వ జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ విజేతలు వీరే : జిల్లా విద్యాశాఖాధికారి
49వ జవహర్ లాల్ నెహ్రూ జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శన లో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ సెమినార్ విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి Dr.D. రాధా కిషన్, శుక్రవారం వెల్లడించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పోటీలలో 23 విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో సత్తా చాటి మొదటి బహుమతి పొందిన విద్యార్ధి 13-04-2022 రోజున జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని డి.ఇ.ఓ పేర్కొన్నారు. *సైంటిఫిక్ అకాడమిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ప్రధాన అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక సైన్స్ సెమినార్ మొదటి బహుమతి K. స్రవంతి (జూనియర్ ఇంటర్,TSEMRS Yellareddypet),రెండవ బహుమతి J.ఆశ్విత (9వ తరగతి, TSMS Naamapoor) గెలుపొందారు వీరికి సెక్టరాల్ కోఆర్డినేటర్ వి. శైలజ, మండల విద్యాధికారి డి.రఘుపతి ,జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు , అభినందనలు తెలియజేశారు.
✍️జిల్లా విద్యాశాఖాధికారి రాజన్నసిరిసిల్ల