Saturday, May 8, 2021
POSTER COMPETITIONS-2021
Young Scientist award Program
ఆన్లైన్ జిల్లా స్థాయి జవహర్‌లాల్ సైన్స్ ప్రదర్శన విజయవంతం.
3 రోజుల్లో ముగియనున్న సైన్స్ ప్రదర్శన రిజిస్ట్రేషన్:
మార్చి 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ జిల్లాస్థాయి ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు మార్చి 1 లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. మార్చి 3, 4 తేదీలలో నిర్వహించే ఆన్లైన్ సైన్స్
పర్యావరణ ప్రదర్శన నిర్వహణ విధానం, ముఖ్య అంశం టెక్నాలజీ అండ్ టాయ్స్
ఉప అంశాలు
1.పర్యావరణ రహితమైన పదార్థాల తయారీ
2. ఆరోగ్యం పరిశుభ్రత
3.ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్
4.గణిత మోడలింగ్
5.సైన్స్ అండ్ టెక్నాలజీ చారిత్రక అభివృద్ధి
లపై ప్రాజెక్ట్ ల తయారి, విధానంపై ఉపాధ్యాయులకు జూన్ మీటింగ్ నిర్వహించి తెలియజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రభుత్వ /జిల్లా పరిషత్/ ప్రైవేట్/ మోడల్ స్కూల్స్/ కేజీబీవీ... అన్ని యాజమాన్యాలకు సంబంధించిన పాఠశాల నుండి కచ్చితంగా 5 అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు 6 తరగతి నుండి 12 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులచే చేయించి గూగుల్ ఫామ్ ద్వారా https://forms.gle/7Zy1KHghFjMYvFMc6
నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు చొరవ చూపాలని అదేశించారు.
ఈ ప్రదర్శనకు సంబంధించి ఏ సందేహం వచ్చినా జిల్లా సైన్స్ అధికారి ఆంజనేయులు 9948539212 గారిని సంప్రదించగలరు.
ఈ కార్యక్రమంలో సెక్టోరల్ ఆఫీసర్ వి.రామచంద్రరావు,
జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, బయోసైన్స్ ఫోరం అధ్యక్షులు పాముల దేవయ్య పాల్గొన్నారు.
ఆన్లైన్ జిల్లా స్థాయి జవహర్‌లాల్ సైన్స్ ప్రదర్శన విజయవంతం.
48 వ జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జిల్లా స్థాయి ఎక్జిభిషన్ (JNNSMEE)2021 లో ముఖ్య అంశంగా "టెక్నాలజీ అండ్ టాయ్స్"
ఉప అంశాలు:
1.Eco friendly material (పర్యావరణ స్నేహపూర్వక పదార్థం)
1st prize Protection of crops from monkeys
R. Malleswari zphs vilasagar
2nd prize Automatic fountain
G. poojitha zphs Sthanbampally
2. Health, hygiene and cleanliness (ఆరోగ్యం, పరిశుభ్రత
1st prize Covid nivarana robot boy
K. Kalyani zphs mustabad
2. Automatic sanitizer dispensing machine
Vinisha Krishnaveni concept School vemulawada
3. Historical development(చారిత్రక అభివృద్ధి)
1st prize Low cost toys with waste materials k.Lavan Kumar TSMS Mandepalli
2nd. Early man tools
MD.Saniya zphs Jillella
4. Interactive software(ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్)
1st Accident remind bus toy
G.Anila zphs boys shivanagar
2nd Artificial intelligence
N. Abhiram krishnaveni concept School vemulawada
5. Mathematical modelling (గణిత మోడలింగ్) Proof of of circles theorem
1st Prize M. Siddipriya vani vidyalaya high Schooldevelopment
2nd Golden ratio Fibonacci Sequence and Golden Spiral
S. Ashirvradan zphs Nookalamarry
గత 15 రోజుల నుండి రిజిస్ట్రేషన్ & exhibit/ప్రాజెక్ట్ అప్లోడ్ కు చివరి తేదీ 3.3.2021 ఆన్లైన్ ఫలితాల విశ్లేషణ, మూల్యాంకనం 5.03.2021 &6.03.2021 విజయవంతంగా ముగిసినట్టు గా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ధనలకోట రాధాకిషన్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్య గమనిక:ప్రతి అంశంలో మొదటి బహుమతి పొందిన విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ పాల్గొంటారు . జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల
ఆన్లైన్ జిల్లా స్థాయి జవహర్‌లాల్ సైన్స్ ప్రదర్శన విజేతలు:
JNNSMEE Science Seminar Winners TSMS BOINPALLY : Patnam Sumedha
Solar fencing from monkey : zphs విలాసాగర్
Kalyani zphs boys Mustabad
Low cost toys with waste materials
K.Lavan Kumar TSMS Mandepalli
Accident Reminder Bus Toy
G.Anila ZPHS BOYS SHIVANAGAR
Mathematical modelling
48 వ జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జిల్లా స్థాయి ఎక్జిభిషన్ (JNNSMEE):
48 వ జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జిల్లా స్థాయి ఎక్జిభిషన్ (JNNSMEE):
★రిజిస్ట్రేషన్ మరియు exhibit/ప్రాజెక్ట్ అప్లోడ్ కు చివరి తేదీ 28.02.2021★ ★Exhibhition Evaluation 01.03.2021 &02.03.2021*
★Exhibits/ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయుటకు లింక్👇https://forms.gle/7Zy1KHghFjMYvFMc6
💐 ఇతివృత్తాలు మరియు ఉప అంశాలు💐 ★అంశం★ "టెక్నాలజీ అండ్ టాయ్స్" ఉప థీమ్స్:
1.పర్యావరణ స్నేహపూర్వక పదార్థం
2. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత
3. ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్
4. చారిత్రక అభివృద్ధి
5. గణిత మోడలింగ్,
🖋️ఉపాధ్యాయులు క్రింది ఉప అంశాల పై అవగాహన కలిగి ఉండాలి.
1.పర్యావరణ అనుకూల పదార్థాలు
18వ శతాబ్దంలో సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవానికి దారితీసింది.ఇది పర్యావరణ క్షీణత కూడా దారితీసింది. దీనివలన మానవుడు సుస్థిరమైన జీవితాన్ని గడపడం కష్టం అవుతుంది. మానవుడే కాదు ఇతర జీవరాశులపై ఈ ప్రభావం ఉంది. గాలి, నీరు, మరియు నేల వివిధ మార్గాలలో కలుషితము అయింది. రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం మరియు ఇతర రంగాలు ఈ కలుషితనికి కారణాలు.
సహజ వనరుల మితిమీరిన దోపిడీ కారణంగా వాతావరణ మార్పులు మనకు సవాలుగా మారాయి.
మనము పై సమస్యలను అధిగమించడానికి మనము కొన్ని పర్యావరణ హితమైన, అనుకూలమైన పదార్థాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వార్తాపత్రికలు, ఉపయోగించిన పుస్తకాలు, మొక్కలు నుండి తయారైన పదార్థాలు ఉదాహరణకు పత్తి బట్టలు, జనపనార ఉత్పత్తి బట్టలు ఉపయోగించినట్లు అయితే పర్యావరణ క్షీణతను అరికట్టవచ్చును మరియు పర్యావరణమును కాపాడుకోవచ్చును.దీనికి నమూనా లు తయారు చేసి ప్రదర్శనలను తయారుచేసి ప్రదర్శించడం వలన పర్యావరణ సృహను కలుగజేయవచ్చును.
2. ఆరోగ్యం-పరిశుభ్రత
ఈ అంశం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులలో, ఆరోగ్యం మరియు పోషక అవసరాలను ప్రభావితలు చేసే అంశాలను అవగాహన😂# కలిగించుట. కరోన వైరస్ covid-19 లాంటి విపత్తులను ఎదురుకోవటానికి నూతన సాంకేతికతను వినియోగించుకునుట మరియు వినూత్న ఆలోచనలు చేయుట.
ఈ ఉప అంశములు క్రింద ఈ క్రింది ప్రయోగాలు నమూనాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చు.
*ఆరోగ్యం మరియు పరిశుభ్రత, మానవుని పై ఎలా ప్రభావితము చూపుతుంది.
*రోగ నిరోధక శక్తి ని పెంచి, వ్యాధుల పై పోరాడే ఆహారము గురించి
*పారిశుధ్యంము శస్త్ర చికిత్స సమయములో ఉపయోగించే పరికరాలు, పదార్థాలు, మాస్కులు, PPE కిట్, మాస్కులు మొదలైన వాటిలో బయోడిగ్రేబుల్ మరియు నాన్ బయోడిగ్రేబుల్ పదార్థాలు వేరు చేయడానికి,తొలిగించడానికి గ్రామీణ పట్టణ ప్రాంతంలో అధునాతన సాంకేతికను వినియోగించుట.
*కరోన,చికెన్ గున్య,డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధులకు కారణాలు, నియంత్రించే విధానాలు లేదా మార్గాలు.
*అంటువ్యాధులను నివారించుటకు సంక్రమణం విచ్ఛిన్నం చేయడానికి వివిధ రకాల వినూత్నమైన చర్యలు.
*సంప్రదాయ మందులు వినియోగం మరియు ఉపయోగం పై ప్రదర్శనలు.
*శారీరక వ్యాయమం మరియు యోగ ఆరోగ్య ప్రయోజనాలు.
*సమతుల్య ఆహారం మరియు పోషక విలువలు కలిగిన ఆహార ప్రదర్శన
*సామాజిక దూరం పాటించడం పై అవగాహన కలిపించుట సామాజిక దూరంపాటించడము వలన కలిగే సమస్యలను అధిగమించడానికి వినూత్న పద్ధతులు
* కల్తీ ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ వస్తువుల ప్రభావం.
*గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో వైద్య సహాయము కొరకు సౌకర్యలు మరియు లింగ అంశాలు.
*స్వచ్ భారత్ అభియాన్ ,జాతీయ ఆత్మ నిర్బర్ భారత్ కుష్టు నిర్ములన కార్యక్రమలు/పథకాలు, విధానాల అమలు- వినూత్న మైన ఆలోచనలు.
*నాలెడ్జ్ బేస్డ్ అభివృద్ధి కొత్త శాస్త్రీయకతను అర్థం చేసుకోవడంలోబయో మెడికల్ సాంకేతికతను వినియోగించడం.
*ఆధునిక పరిశోధన లలో హోమియోపతి, ఆయుర్వేద లాంటి గురించి తెలిపిన వాస్తవాల ప్రదర్శన.
*జీవనశైలి మరియు దానితో సంబంధం మంచి మరియు చెడు ఆరోగ్యం పరిశోధనల ద్వారా తెలిపిన వాస్తవాలు ప్రదర్శన.
*సుస్థిరమైన అభివృద్ధి లో వ్యవసాయం మరియు ఆరోగ్యం బొమ్మ/ నమూనాల ప్రదర్శన.
*ఎరువులు, పురుగుల మందులు, హార్మోన్లు మరియు ఆహార రంగులు వాడడం వలన, మానవుని శరీరం పై రసాయన అవశేషాల ప్రభావం, బొమ్మల/ నమూనల ప్రదర్శన
* వికలాంగుల ను కరోన వైరస్ నుండి కాపాడడానికి వినూత్న నియంత్రణ చర్యలు, చికిత్స సాధనలు/సహయలు.
3 ఇంట రాక్టివ్
సాఫ్ట్ వేర్
*ఇంటరాక్టివ్ సాఫ్ట్ వేర్ ,ఉపాద్యాయులు మరియు పిల్లలు నూతన మరియు వినూత్న మైన ఆలోచనలతో టాయ్స్ డిజెన్ మరియు అభివృద్ధికి ఉపయోగ పడుతుంది.
*ఈ ఇంటరాక్టివ్ సాఫ్ట్ వేర్ టాయ్స్ తో పాటు టాయ్ పోగ్రామ్ డిజెన్ చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది.
*ఈ టాయ్ పోగ్రామ్ భవిష్యత్ కంప్యూటర్ పోగ్రామ్ కు ఉపయోగ పడుతుంది.
*టాయ్ పోగ్రామ్ ద్వారా nవ పదం కనుగొనుట, వర్గసమికరణానికి మూలాల కనుగొనుట, ఇచ్చిన సంఖ్య ప్రధాన సంఖ్య అవునా?కాదా?అని కనుగొనుట, ఓం నియమములో వోల్టేజ్,కరెంటు,నిరోధములను కనుగొనుట లాంటి సమస్యలకు సాధన కనుగొనవచ్చు.
ఈ ఎగ్జిబిషన్ లో ప్రోటో టైప్ టాయ్, వీడియో గేమ్స్, చిన్న టాయ్స్ కీలు బొమ్మల టాయ్స్ వాటిని డిజైన్ చేయడానికి అవసరము అయ్యే సాఫ్ట్ వేర్ లను ప్రదర్శించవచ్చును
*ప్రోటో టైప్ పరీక్ష చేయడానికి అవసరం అయ్యే సాఫ్ట్ వేర్ లను ప్రదర్శించవచ్చు
*టాయ్స్ అవసరమయ్యే instructions manual తయారు చేసి సాఫ్ట్ వేర్ ను ప్రదర్శించవచ్చును.
విద్యార్థులలో టాయ్ పోగ్రామ్ వలన సమస్యల పరిష్కారం, సృజనాత్మక, భావోద్వేగాల నియంత్రణ మరియు సామాజిక అభివృద్ధి కలుగుతుంది.
4 చారిత్రక అభివృద్ధి
ఆటల ద్వారా నేర్చుకోవడం పిల్లల అభివృద్ధి లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. టాయ్స్ సమస్య పరిష్కారానికి, సైకో మోటార్ నైపుణ్యలు అభివృద్ధి చేయడం మరియు సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగ పడుతుంది.
భారత దేశంలో ప్రాచీన కాలం నుండి టాయ్స్ ఉన్నాయి, సాంప్రదాయ భారతీయ బొమ్మలు(టాయ్స్) నిజ జీవిత జ్ఞానంను ప్రతిబింబాలు మరియు ఇవి సరళమైనవి.
మనకు లభించే సాహిత్యం ప్రకారం టాయ్స్ మన సంస్కృతిని ప్రతిబింబించాయి, మనిషి మనస్సు మరియు శారీరకంగా ఆరోగ్యం ఉండడానికి సహకరించాయి.
మన ప్రాచీన సింధు నాగరికత కాలంలో కూడా టాయ్స్ ఉన్నాయి, ఇందులో వాలు కార్ట్ రాటిల్ లాంటి ఆట బొమ్మలు కూడా ఉన్నాయి.
కోల్పోయిన వారసత్వం మును సృష్టించడానికి వేదిక అవసరము, యువతరం ఈ బాధ్యతను తీసుకోవాల్సి ఉంది, ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ బొమ్మలు తిరస్కరించి సేంద్రియ బొమ్మల ప్రాముఖ్యత ను పెంచాల్సి ఉంది. దీనికి ఎంబేడెడ్ సైన్స్ ఉపయోగ పడుతుంది.
విద్యార్థులు టాయ్స్ అభివృద్ధి చేసేటప్పుడు 2 రకాలుగా బొమ్మలు చేయవచ్చును.
1స్టాటిక్ 2.డైనమిక్
స్టాటిక్ విభాగంలో బంకమట్టి, వెదురు, లోహాలు, కాగితం వంటి వాటిని ఉపయోగించి జంతువులు, పక్షులు, గాలి పటాల లాంటి బొమ్మల ను తయారు చేయవచ్చును
డైనమిక్ విభాగంలో కదిలే బొమ్మలు ,ధ్వని కాంతి ఉత్పత్తి చేసే బొమ్మలు కదిలే వాహనాలు, బొమ్మలు, రోబోట్లు మొదలైనవి.
ఈ బొమ్మలు సైన్స్ వ్ వివిధ భావాలు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల అభివృద్ధి లో ఉపయోగపడుతాయి
5 గణిత మోడలింగ్
గణిత మోడలింగ్ రోజువారీ సమస్యల సాధనకు ,పర్యావరణ సంబదిత సమస్యల సాధనకు ఉపయోగ పడుతుంది. వాతావరణం అంచనాకు, భ్రమనం మరియు పరి భ్రమనం, తోక చుక్కలు, ఉల్కలు, చిన్నఉపగ్రహల కక్ష్య మార్గాన్ని అంచన వేయడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
అంటూ వ్యాధులు సంబంధించినప్పుడు అది ఎలా వ్యాప్తి చెందుతుంది గణిత మోడలింగ్ తెలుపుతుంది
యుద్ధం తరువాత జరిగే వినాశక పరిస్థితులు ఉదాహరణకు అనుపేళ్ళు అంచనా వేయడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
మానవుని శరీరం పై మందుల ప్రభావాన్ని, గుండె, మెదడు, ఊపిరితిత్తులు,మూత్ర పిండాలు, పనిచేసే స్థితిని వివరించుటకు గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
క్యాన్సర్ చికిత్స, గాయనమూనా, కణజాలం నిర్మాణము లో గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
జీవక్రియ,కణాంతరా జీవరసాయన ప్రతి చర్యలను వివరించుటకు గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
డేటా నిర్వహణ మరియు సమాచారాన్ని కూడా గణిత మోడలింగ్ ఉపయోగపడుతుంది
నగర ప్రణాళిక లో గణిత మోడలింగ్ పాత్ర ,అవాంచిత భవిషత్తును అర్థం చేసుకోవడానికి గణిత మోడలింగ్ ఉపయోగ పడుతుంది.
◆సైన్స్ ఎగ్జిబిషన్ల లో భాగంగా, అన్ని యాజమాన్యాల విద్యార్థుల కోసం తేదీ 28.02.2021 న సెమినార్ నిర్వహించబడును
సెమినార్‌కు అంశం:
"డైలీ లైఫ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు"
సెమినార్ కు సంబంధించి పాల్గొనే విద్యార్థుల వివరాలు
తేదీ 25.02.2021 లోగా dso గారికి 9948539212 కు whatsup ద్వారా పంపాలి.
★★గమనిక★★
1. అన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ,స్థానిక, ఆశ్రమ,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
ప్రదానోపాధ్యాయులు
పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థులు తప్పని సరిగా పాల్గొనేల ప్రోత్సహించవలిసిందిగా కొరనైనది.
◆MEO s మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల HS/UPS ప్రదానోపాధ్యాయు
లకు సమాచారం అందించి
ఈ ఎక్సిబిషన్ సక్సెస్ కావడానికి కృషి చేయవలిసిందిగా సూచించనైనది.
◆EXHIBITS రిజిస్ట్రేషన్ మరియు అప్లోడ్ చేయడానికి కావలిసిన సమాచారం కొరకు క్రింది ప్రొఫార్మ ను చూడగలరు.
వివరాలకు DSO ను 9948539212 కు సంప్రదించగలరు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల
JNNSMEE 2021ఆన్లైన్ ప్రదర్శన:
గైడ్ టీచర్లకు సూచనలు
సమయం చాలా తక్కువ ఉన్నందున త్వరపడి
ఈ ప్రదర్శన ఆన్లైన్ Google Forms ద్వారా జరుగుతుంది
1.ఎగ్జిట్ కు సంబంధించిన ఫోటో, ఆడియో, వీడియో ఫైల్స్ ను మీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
2.విద్యార్థి వివరాలు: పేరు, తరగతి, జెండర్, పాఠశాల పేరు
3.ఎక్సిబిట్ వివరాలు: subtheme పేరు,ఎక్సిబిట్ పేరు
4.గైడ్ టీచర్ వివరాలు: పేరు, హోదా,సెల్ నంబర్, ఈమెయిల్.
5.250 పదాల తో కూడిన రైట్ అప్ పేపర్ పై విద్యార్ధి ఫొటో, ఎక్సిబిట్ ఫొటో అతికించి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి*
6.ఎక్సిబిట్ కు సంబంధించిన ఆడియో ఫైల్ అప్లోడ్ చేయాలి
7.ఎక్సిబీట్ కు సంబంధించిన విడియో 2నిమిషాలు/20ఎంబి
నిడివి కల్గిన ఫైల్ అప్లోడ్ చేయాలి*
8.విద్యార్థులచే చాలా సార్లు రిహార్సిల్స్ చేయించి 1/3/2021 తారీకు లోపు అప్లోడ్ చేయాలి.
9.ప్రతిదీ చివరి తేదీ వరకు వేచి చూసి అప్లోడ్ చేయడం వల్ల ఎడిట్ చేసుకునే సమయం లేకపోవడం వలన సమస్యలు వస్తాయి. అందుకే నిర్ణీత సమయం లో చేసుకుంటే బాగుంటుంది.
10.ఎవరైనా టెక్నికల్ సహాయం అవసరమైతే మన కపిల నరేష్ సార్ 9700554431 విద్యసిరి ఛానల్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించగలరు. జిల్లా సైన్స్ అధికారి రాజన్న సిరిసిల్ల
Judgement
December 21 District level ఆన్లైన్ ఇన్స్పైర్ మనాక్ 2019-20 ప్రదర్శన: రాజన్న సిరిసిల్ల
జిల్లా విద్యాశాఖ, రాజన్న సిరిసిల్ల**
జిల్లాలోని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయునది,
👉 క్రిందటి సంవత్సరం 2019-20 Inspire అవార్డ్స్ లో భాగంగా మన జిల్లా నుండి 35 మంది విద్యార్థులు రూ. 10,000/- చొప్పున పొంది ఎంపికైనారు.
ఈ విద్యా సంవత్సరం 2020-21 విద్యార్థుల ఎంపిక ఇంకా జరుపబడలేదు
👉 DST, GOI మరియు SCERT తెలంగాణ వారి ఆదేశానుసారం ఎంపికైన ఈ 35 విద్యార్థులకు డిసెంబర్ 07వ తేదీ నుండి 11 వ తేదీ లోపు ఆన్లైన్ లో MANAK Competition App ద్వారా జిల్లా స్థాయి విజ్ఞాన మేళా నిర్వహించుటకు సన్నాహాలు చేయమని ఆదేశించింది.
👉👉కనుక ఎంపికయిన విద్యార్థుల ప్రధానోపాధ్యాయులు వారి గైడ్ టీచర్ సహాయంతో విద్యార్థుల ద్వారా వారి వారి ప్రాజెక్ట్ల రూపకల్పన చేస్తూ డిసెంబర్ 5వ తేదీ లోపు సంసిద్ధులు చేయగలరు.
👉 MANAK Competition App ఆన్లైన్ లో జిల్లా స్థాయి Inspire విజ్ఞాన్ మేళా పూర్తి విధి విధానాలను త్వరలో ప్రధానోపాధ్యాయులకు, గైడ్ టీచర్స్ కు అవగాహన కల్పించడం జరుగుతుంది.
👉 కనుక ఎంపికైన ప్రతి ప్రాజెక్టు తయారీలో నిమగ్నం చేయగలరని కోరుచున్నాం.
DEO RAJANNA SIRCILLA

ఆన్లైన్ ఇన్స్పైర్ మనాక్ 2019-20 ప్రదర్శన విజేతలు వీరే:
ఇన్స్పైర్ మనకు కార్యక్రమాన్ని ఈసారి covid-19 కారణంగా మొట్టమొదటిసారిగా జిల్లాస్థాయి ప్రదర్శన పోటీలు ఆన్లైన్ లో నిర్వహించాము. మన జిల్లా నుండి , ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, పాఠశాలల నుండి 35 మంది విద్యార్థిని, విద్యార్థులు ఇంటి వద్ద ఉండి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపి ప్రదర్శనలను తయారు చేసి రెండు నిమిషాల నిడివి గల వీడియో, ఆడియో, సంబంధించిన ఫోటోలు మరియు రైట్ అప్ లు ఇన్స్పైర్ అవార్డ్స్ యాప్ లో ఈనెల 4వ తేదీ నుండి 18వ తేదీ శుక్రవారం వరకు అప్లోడ్ చేసినారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను న్యాయనిర్ణేతలు ఆన్లైన్లో పరిశీలించి మన జిల్లా నుండి ఐదు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేయడం జరిగింది, వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు పోటీలలో పాల్గొనటారు అని జిల్లా విద్యాశాఖ అధికారి Dr.D. రాధకిషన్ గారు తెలిపారు.
జిల్లా నుండి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన వారి వివరాలు
1.అప్లై ఫెర్టిలైజర్స్ ఇన్ ఈజీ వే (సులభ పద్ధతిలో ఎరువులను వేసే పరికరం)
మారుపాక చంద్రశేఖర్ జడ్.పి.హెచ్.ఎస్ సనుగుల,
2. వీల్ సీడ్స్ స్ప్రే మెషిన్(విత్తనాలు చల్లడం ఎరువులు స్ప్రే చేయడం, కలుపు మొక్కలు తీసే మల్టిపుల్ యంత్రం)
B. సరయు కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్, వేములవాడ
3. ఆటోమేటిక్ టాయిలెట్ వాటర్ ప్లస్ (చేతితో తాకకుండా వాటర్ ప్లస్ చేసే పరికరం)
చిలువేరు శ్రీ వర్ధన్ జడ్.పి.హెచ్.ఎస్ లింగంపేట్.
4. ఆటోమేటిక్ కాబ్వెబ్ అండ్ డస్ట్ రిమూవర్ ఫ్రమ్ సీలింగ్(తక్కువ ఖర్చుతో బిల్డింగ్ యొక్క సీలింగ్ ని శుభ్రం చేసే పరికరం)
ఏగోళం నవదీప్
జడ్.పి.హెచ్.ఎస్ సనుగుల
5. ఫ్రెండ్లీ అండ్ అఫార్డబ్లే టాయిలెట్ (మొబైల్ టాయిలెట్)
తునికి ఆకాష్
జడ్.పి.హెచ్.ఎస్ ఇల్లంతకుంట.
ఎంపికైన టువంటి విద్యార్థినీ విద్యార్థులను జిల్లా విద్యా శాఖ పక్షాన DEO,Dr.D. రాధా కిషన్ గారు మరియు జిల్లా సైన్స్ అధికారి వి. ఆంజనేయులు , సెక్టోరల్ ఆఫీసర్స్ వి.రామచంద్రరావు, N.రాజేంద్ర శర్మ, అశోక్ రావు అభినందనలు తెలియజేశారు.





































